ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి మీద హై కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ అధికార వైసీపీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అదే సమయంలో పరోక్షంగా వైసీపీ ప్రభుత్వానికి సహాయం చేస్తుంది అని పేరు తెచ్చుకున్న బీజేపీ తన వైఖరికి ఇప్పుడు స్పష్టం చేసింది.మొదటి నుండి కేవలం రాష్ట్ర బీజేపీ నాయకత్వమే అమరావతి రాజధానిని ఒప్పుకుంటూ వచ్చారు. కేంద్ర నాయకత్వం అయిన GVL చాలా సార్లు రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం అన్నట్లు ప్రకటనలు ఇచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం మూడు రాజధానుల అవక్సం లేదు అంటూ ముందుకు వచ్చారు.
మూడు రాజధానులు ఏర్పాటు చేసుకునే చట్టం చేసుకునే అవకాశం లేదని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం అలా పిటిషన్ దాఖలు చేయగానే ఇలా బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందించారు. న్యాయపరంగా మూడు రాజధానులు సాధ్యం కావని స్పష్టం చేశారు. మూడు రాజాధానుల ప్రతిపాదన రాజకీయ ఎత్తుగడ అని అన్నారు. మూడు రాజధానుల పేరుతో ఏపీ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్ళిస్తుంది అని విమర్శించారు. మూడు రాజధానులు దేవుడెరుగు మూడేళ్లలో మూడు బిల్డింగ్లైనా కట్టారా? అని ప్రశ్నించారు. ఏ అభివృద్ధి చేయకుండా మూడు రాజధానులు ఎందుకని ఆయన ప్రశ్నించారు.
రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదే అని జీవీఎల్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునే అంశం కాదన్నారు. అమరావతి రైతులకు బీజేపీ ఎప్పుడూ అండగానే ఉంటుందని ఎంపీ జీవీఎల్ అన్నారు. అమరావతి రైతులకు అన్యాయం జరిగిందని వారు భూములు ఇచ్చింది ఒక రాజకీయ పార్టీకి కాదు ప్రభుత్వానికి అని జీవీఎల్ గుర్తు చేశారు. తమకు జరిగిన అన్యాయాన్ని ఎదుర్కొనేందుకు న్యాయం కోం వారు యాత్ర చేయడంలో తప్పు లేదని వారి యాత్రకు తమ మద్దతు ఉంటుందని జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. అసలేమీ చేయకుండానే మూడు రాజధానులు కడతామంటున్నారు ఇది ప్రజలను మభ్యపెట్టడం కాదా అని ప్రశ్నించారు.