అమరావతి రాజధాని మీద అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ ల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరుకుంది. నిన్నటి రోజున ముఖ్యమంత్రి జగన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మరీ రాజధాని ని నిర్మించడానికి సరిపడా డబ్బులు లేవు అన్నారు. అది సమయంలో ప్రతిపక్ష నేత పైసా ఖర్చు లేకుండా 5కోట్ల మంది ప్రజలకు సంపద సృష్టి కేంద్రంగా అమరావతిని తీర్చిదిద్దుతామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డితో సహా అందరి ఆమోదంతోనే రాజధానిగా అమరావతిని నిర్ణయించామని గుర్తుచేశారు. తెలుగుదేశం ఇదే అంశానికి ఇప్పటికీ కట్టుబడి ఉందని తేల్చి చెప్పారు. రాజధాని అంశంపై చంద్రబాబు అధ్యక్షతన తెదేపా శాసనసభాపక్ష సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది.
జగన్‌తో రేపో మాపో జరిగే పార్టీ సమావేశానికి వెళ్లేందుకు వారి ఎమ్మెల్యేలు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. మళ్లీ టికెట్లు రావనే భయం కొందరిలో ఉంటే, వచ్చినా గెలవలేమనే ఆందోళన వారిలో ఉందని అన్నారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఇప్పుడు చేస్తున్న ప్రజా పోరాటమే తిరిగి తమను మళ్లీ గెలిపిస్తుందని స్పష్టం చేశారు.స్వార్ధ రాజకీయాల కోసం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతూ అమరావతిపై మాట తప్పి మడమ తిప్పింది జగనేనని చంద్రబాబు మండిపడ్డారు. స్వయం సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టుగా అమరావతికి ప్రణాళికలు చేశామని ఖర్చు లేకుండానే 33వేల ఎకరాల భూ సమీకరణ చేసి మౌలిక సదుపాయాలు సమకూర్చామన్నారు. అమరావతి నిర్మాణం పూర్తేతే రాష్ట్రమంతటికీ సంపద సృష్టి కేంద్రమవుతుందన్నారు.