సీఎం జగన్ సభలో నిరసన తెలిపి ఉద్యోగం నుంచి తొలగించబడిన ఏఆర్ కానిస్టేబుల్ కేసులో సాక్ష్యం చెప్పిన లక్ష్మీ ఇంటి వద్ద ఆమె మాజీ భర్త గొడవ చేశాడు. లక్ష్మీ భర్త వేణుగోపాల్ రెడ్డి, అతని సోదరుడు నారాయణరెడ్డి గొడవకు దిగారు. భర్తతో తనకు సంబంధం లేదని, విడాకులు కూడా తీసుకున్నాని, కానీ పోలీసులు ఉద్దేశపూర్వకంగా వచ్చి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆమె బాధ పడ్డారు. న్యాయం చేయాల్సిన పోలీసులే ఇలా ఇబ్బందులకు గురి చేస్తే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు.
పోలీసులు మాత్రం డయల్ 100కు ఫిర్యాదు రావడంతో వచ్చామని చెబుతున్నారు. విడాకులు తీసుకున్న నోటీసులను పోలీసులకు చూపించి గొడవ లేకుండా చూడాలని లక్ష్మీ కోరింది. గొడవ చేసేందుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులని పోలీసులు స్టేషన్కు తీసుకెళ్లారు. ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ విషయంలో సాక్ష్యం చెప్పినప్పటి నుంచి పోలీసులు తనను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని మహిళ ఆరోపించింది.