ఫేస్ రిగ్నిజేషన్ యాప్ సమస్యల మీద ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం అయిన విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఫేస్ రిగ్నిజేషన్ యాప్‌పై వస్తున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడాలనేదే ముఖ్యమంత్రి ఉద్దేశ్యం అని తెలిపారు. తమది ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని అన్నారు. ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. టీచర్లపై పెట్టిన కేసుల విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని స్పష్టం చేశారు.
ఉద్యోగసంఘాల నేతలతో రెండు అంశాలపై చర్చించాం. ఫేస్ రిగ్నిజేషన్ యాప్ హాజరుపై వస్తున్న సమస్యలను త్వరగా పరిష్కరిస్తాం. మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ గవర్నమెంట్. ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తెస్తే తప్పకుండా పరిష్కరిస్తాం. టీచర్లపై పెట్టిన కేసుల అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తాం. ఇవాళ 86 శాతం మంది యాప్‌లో హాజరు నమోదు చేశారు. సర్వీస్ రూల్స్‌లో ఉన్నవాటినే అమలుచేస్తున్నాం. ఉపాధ్యాయులు, విద్యార్థులకు మంచి చేయాలనేదే మా తపన అని అన్నారు.సీపీఎస్ సమస్యపై రెండు, మూడు రోజుల్లో ఉద్యోగులతో మాట్లాడతామని పేర్కొన్నారు. కొత్తగా 38 డిప్యూటీ డీఈఓ పోస్టులను భర్తీ చేస్తున్నామని వెల్లడించారు.
“ఫేస్ రిగ్నిజేషన్ యాప్ హాజరులో ఉన్న సాంకేతిక సమస్యలు పరిశీలించేందుకు 15 రోజుల సమయం కోరామని, సాంకేతిక ఇబ్బందులు తొలగించిన తర్వాతే పూర్తి స్థాయిలో అమలు చేయాలని, ఉమ్మడి సర్వీస్ నిబంధనలు న్యాయస్థాన పరిధిలో ఉన్నందున 248 ఎంఈఓ పోస్టులను ప్రభుత్వ టీచర్లతో ఎఫ్ఏసీలుగా భర్తీ చేయబోతున్నారని, 672 ఎంఈఓ పోస్టులను జెడ్పీ టీచర్లతో ఎఫ్ఏసీలుగా భర్తీ చేయనున్నారని, ఫేస్ రిక్నగేషన్ యాప్ మా ఫోన్లల్లోనే డౌన్ లోడ్ చేసుకోవాలని మంత్రి సూచించారని” ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సాయి శ్రీనివాస్ తెలిపారు.