ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జగనన్న ఇళ్ళ కాలనీల పేరిట ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వం ఇళ్ల స్థలాలను కేటాయించింది. అందులో శ్మశానాలు,చెరువు కుంటలు,లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి. దాంతో అక్కడ నివాసయోగ్యం కాదు అని ఎలా ఇల్లు కట్టుకోవాలని పేదలు గగ్గోలు పెడుతూ వచ్చారు. ఇక విపక్షాలు అయితే ఇది పద్ధతి కాదు అని చాలా కాలంగా చెబుతూనే ఉన్నారు.
ఇప్పుడు గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పేదలంటే గౌరవం ఉండాలిగా వారు కూడా రాజ్యాంగం ప్రకారం ఈ దేశ పౌరులు కారా. వారికి కూడా జీవించే హక్కు ఉంది కదా. వారి మనోభావాలు ఏ కొశానా ఎవరికీ పట్టవా,వారికి ఎక్కడ పడితే అక్కడ ఇళ్ళ స్థలాలను కేటాయించవచ్చా. ఇదేమి ధర్మమని ప్రభుత్వాన్ని గట్టిగానే నిలదీసింది.
ముప్పయి మూడు లక్షల ఇళ్ళు కట్టించి ఇస్తామని రికార్డు కోసం డప్పు కొట్టుకుంటున్న వైసీపీ నాయకులకి వాస్తవాలు ఏమి అర్దం కావడం లేదు.కపిలేశ్వరం వాసి యాకోబు అనే వ్యక్తి హై కోర్టులో ఒక ప్రజావ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్ని విచారణకు స్వీకరించిన హై కోర్టు శ్మశానంలో ఇళ్ళు ఎక్కడైనా కేటాయిస్తారా అంటూ రాష్ట్ర ప్రభుత్వం మీద మండిపడింది. పేదలకు గౌరవం ఇవ్వవద్దా అంటూ పేర్కొంది.
ఈ విషయమే కాదు రాజధాని అమరావతిలో కూడా మాస్టర్ ప్లాన్ జోనల్ రెగ్యులేషన్స్ సీఆర్డీఏ భూ కేటాయింపుల విధానానికి వ్యతిరేకంగా ఇళ్ళను వేరే వారికి కేటాయిస్తున్నారు అన్న పిటిషన్ మీద హై కోర్టులో విచారణ సాగుతోంది. మొత్తానికి చూస్తే వైసీపీ చేస్తున్న పనులు ఏవి కూడా సక్సెస్ కావడం లేదు. ప్రతి విషయం మీద హై కోర్టుతో మొట్టికాయలు తప్పడం లేదు.