టీడీపీ అధినేత,ప్రతిపక్ష నేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం పర్యటన తీవ్ర ఉద్రిక్తతల మధ్య సాగుతోంది. సొంత నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటనకు వైసీపీ కార్యకర్తలు అడ్డు పడుతున్నారు. చంద్రబాబు కుప్పం పర్యటన రెండో రోజు బస్టాండ్ వద్ద అన్నా క్యాంటిన్ ను ప్రారంభించాల్సి ఉండగా ఆ క్యాంటిన్ ను వైసీపీ కార్యకర్తలు ధ్వసం చేశారు. అన్న క్యాంటిన్ ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ చంద్రబాబు అక్కడే బైఠాయించారు. పెద్ద సంఖ్యలో తెలుగుదేశం కార్యకర్తలు నిరసన ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో చంద్రబాబు కూడా పాల్గొన్నారు. అర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుంచి బస్టాండ్ వరకూ ర్యాలీ కొనసాగింది. అనంతరం బస్టాండ్ వద్ద ధ్వంసం చేసిన అన్నాక్యాంటిన్ వద్ద చంద్రబాబు బైఠాయించారు.
పోలీసులు, తెదేపా కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీంతో పలువురు తెదేపా కార్యకర్తలకు గాయపడ్డారు. పోలీసుల తీరును చంద్రబాబు తీవ్రంగా ఖండించారు.అంతకుముందు వైసీపీ కార్యకర్తలు టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు. తొలిరోజు చంద్రబాబు కుప్పం పర్యటన కూడా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. రామకుప్పం మండలం కొల్లుపల్లిలో చంద్రబాబు రోడ్ షో మార్గంలో టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన పార్టీ జెండాలకు పోటీగా వైఎస్సార్‌సీపీ జెండా తోరణాలు కట్టారు. వైఎస్సార్‌సీపీ తోరణాలను తొలగించేందుకు టీడీపీ కార్యకర్తలు ప్రయత్నించడం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
నారా లోకేష్ ఈ విషయం మీద స్పందిస్తూ పేద వాళ్ళ నోటికాడ ముద్ద లాక్కునే మూర్ఖపు అలవాట్లు ఉన్నవారు అధికారంలో ఉన్నారు. జగన్ పేద వాళ్లకు అన్నం పెట్టరు,ఇతరులను పెట్టనివ్వరు అని, రౌడీయిజం పులివెందుల లో చూసుకో కుప్పంలో తాట తీస్తాం అని ఘాటుగా స్పందించారు.
జగన్ రెడ్డి కుప్పంలో ఎన్ని కుప్పి గంతులు వేసినా చివరికి భంగపాటు తప్పదు. పేదవాళ్ల నోటి కాడ ముద్ద లాక్కునే మూర్ఖపు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. ఆయన పేదవాళ్లకు అన్నం పెట్టడు ఇతరులను పెట్టనివ్వడు. రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్ల పై వైసిపి మూకలు దాడులు చేస్తూనే ఉన్నారు.(1/2) pic.twitter.com/2cEp3UzSvs
— Lokesh Nara (@naralokesh) August 25, 2022