జగన్మోహన్ రెడ్డి కి గొప్ప విజయం దక్కి, ఆయన కల అయిన సీఎం సీట్ ఎక్కినా కేసులు, స్కాంలు నిద్దర పట్టనివ్వడం లేదు. కొన్ని ప్రస్తుతం నడుస్తున్న కేసులు తో పాటు, కొన్ని పూర్వపు కేసులు తాలూకా నిజాలు బయటకు వచ్చి కలవర పెడుతూనే ఉన్నాయి. సామాన్య ప్రజలకు అంతగా తెలియని క్విడ్ ప్రో కో లాంటి ఆర్ధిక మోసాలను సీఎం జగన్మోహన్ రెడ్డి దయ వల్ల తెలిసిపోయింది. ఇప్పుడు తాజాగా అధికార పార్టీ మీద ఆయన తండ్రి గారైన రాజశేఖర్ రెడ్డి హయాంలోని లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూముల వ్యహారంలో క్విడ్ ప్రో కో జరిగింది, దానిలో సీఎం జగన్ కు, ఆయన అత్యంత సన్నిహితులైన కుటుంబ సభ్యులకు ప్రమేయం ఉందని వార్తలు వస్తున్నాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేర ఇందూ ప్రాజెక్ట్స్ కు ఎకరం 50 వేల రూపాయల చొప్పున వేల ఎకరాల భూమి కేటాయింపు జరిగింది.వాటిలో పరిశ్రమలు, ప్రాజెక్టుల ఏర్పాటు మాటే ఏత్తని ఇందూ ప్రాజెక్టులు ఆ భూములను తాకట్టు పెట్టి వేల కోట్ల రూపాయల రుణాలను పొందింది. ఆ సొమ్ములో కొంత భాగం జగన్ కంపెనీల్లోకి పెట్టుబడులుగా మరలాయని సీబీఐ అప్పట్లో కేసు నమోదు చేసింది,ఆ విచారణ ఇంకా కొనసాగుతోంది.ఈడీ జగన్ వి కొన్ని ఆస్తులను కూడా అటాచ్ చేసింది. దీంతో ఇందూ ప్రాజెక్ట్ చేతులెత్తేసింది. దీంతో బ్యాంకులు ఇందూ ప్రాజెక్టు దివాళా తీసిందని ప్రకటించేశాయి.ఐదువందల కోట్ల రూపాయలకు ఇందు ఆస్తులను ఓ కంపెనీకి అప్పనంగా దారాదత్తం చేసేయడానికి బ్యాంకులు అంగీకరించేశాయి. అసలు బ్యాంకులు అందుకు ఎలా అంగీకరించాయో ఆర్థిక నిపుణులకు కూడా అర్ధం కాక తలలు బద్దలు కొట్టుకుంటున్నారు.
ప్రభుత్వం ఆ భూముల కేటాయింపులను రద్దు చేసేసి చాలా కాలమైంది. ఆ భూములు ఇప్పుడు ఈడీ అధీనంలో ఉన్నాయి. అటువంటప్పుడు బ్యాంకులు ఆ భూములు తమ తనఖాలో ఉన్నాయంటూ,ఏదో ఒక కంపెనీకి రూ.500 కోట్ల రూపాయలకు అప్పనంగా అప్పగించేయడాన్ని ప్రభుత్వం అడ్డుకోవాలి. కేటాయింపులు రద్దు చేశామని నోటీసులు ఇవ్వాలి, అలా చేయడం లేదు. ఇందు ప్రాజెక్ట్స్ భూములపై రూ.5000 కోట్ల వరకూ అప్పులిచ్చిన బ్యాంకులు దివాళా ప్రక్రియలో రూ. 500 కోట్లిస్తే చాలని అంగీకరించడం వెనుక మతలబు ఏమిటి? అలా కాకుండా ఆ భూములను వేలం వేస్తే ఇంకా ఎక్కువ సొమ్ము వస్తుంది కదా? కానీ బ్యాంకులు వేలం వేయకుండా,రూ.500 కోట్లిస్తామని వచ్చిన కంపెనీకే కట్టబెట్టడానికి సిద్ధమైపోవడం వెనుక ఉన్న మాయ (జగన్మాయ) ఏమిటి…
లేపాక్షి నాలెడ్జ్ భూములను ఇప్పుడు కొనుగోలు చేస్తున్న సంస్థలో జగన్ మేనమామ,రవీంధ్రనాథ్ రెడ్డి కుమారుడు ఒక డైరక్టర్. ఈ కంపెనీకి డబ్బులు సమకూరుస్తోంది ఏపీలో పోర్టులు సెజ్‌లు దక్కించుకున్న అరబిందో సంస్థ.ఇందు ప్రాజెక్టు ఆస్తులను 500 కోట్ల రూపాయల అతి చౌక ధరకు అప్పనంగా తీసేసుకుంటున్న సంస్థ పేరు ఎర్తిన్ ప్రాజెక్టు. ఆ సంస్థ డైరెక్టర్ జగన్ మేనమామ కుమారుడు. ఇదే కదా జగన్ కు అందెవేసిన చేయి అయిన “క్విడ్ ప్రో కో”..
