తిరుపతి జిల్లా..సత్యవేడు దగ్గర శ్రీసిటీ ని ఈ రోజు కలెక్టర్ వెంకట రమణ సందర్శించారు..యీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. తిరుపతి జిల్లాలో పరిశ్రమల స్థాపనకు చాలా అనుకూలమైన వాతావరణం ఉందని పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు . శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ శ్రీసిటీ బిజినేస్ సెంటర్ లో జిల్లా అధికారులు, శ్రీసిటీ ఎండి రవిసన్నారెడ్డి తో సమావేశయ్యారు.
శ్రీసిటీ ఎండి మాట్లాడుతూ……శ్రీసిటీలో పరిశ్రమల స్థాపనకు వున్న సౌకర్యాలను , ఏర్పాటు అయిన దాదాపు 190 పరిశ్రమలలో 50 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నామని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించి , చిన్న చిన్న రెవెన్యూ , పవర్ సమస్యలు పరిష్కరించాలని కోరారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…. శ్రీసిటీ లో రెవెన్యూ, ఎపిఐఐసి అధికారులు తమపరిధిలో భూసమస్యలు వెంటనే పరిష్కరించాలని సూచించారు. శ్రీసిటీ యాజమాన్యం ఫైర్ , పోలీస్ స్టేషన్లకు స్థల కేటాయింపు సంతోషమని అన్నారు. తడ – శ్రీకాళహస్తి 4 లైన్ రహదారి నిర్మాణ అవసరాలు , తెలుగు గంగ వాటర్ ధరలు రీషెడ్యూల్ అంశాల పై అధికారులతో చర్చించారు .
తిరుపతి జిల్లా కలెక్టర్ మొదటిసారి శ్రీసిటీ లో పర్యటించడంతో శ్రీసిటీఎండి ఆయనకు ఘనస్వాగతం పలికి సత్కరించారు.
ఈ సమీక్షలో డి ఆర్ ఓ శ్రీనివాసరావు ఆర్డీఓ రోస్ మాండ్ , శ్రీసిటీ ప్రతినిధి రామచంద్రారెడ్డి , ఎపిఐఐసి అధికారులు చంద్రశేఖర్ , సుహానాసోని ,రెవెన్యూ, ఇరిగేషన్ , ఆర్ అండ్ బి అధికారులు పాల్గొన్నారు.