కోనసీమలో జరిగిన విధ్వంసంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ కొన్ని రోజుల కిందట జిల్లాల విభజనను రాష్ట్ర ప్రభుత్వం చేసిందన్నారు. అన్ని జిల్లాలకు ఒక విధానం పెట్టారని కొనసీమకు ప్రత్యేక విధానం అవలంబించారన్నారు. అన్ని జిల్లాలకు నామకరణం చేసిన రోజే అంబేద్కర్ కోనసీమ అని ఉంటే ఇబ్బంది వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు. జాతీయస్థాయి నాయకుల పేర్లు పెట్టడం జనసేన వ్యతిరేకించదని స్పష్టం చేశారు. వైస్సార్ పేరుతో కడప జిల్లా.. అంతకుముందు పొట్టి శ్రీరాములు పేరు నెల్లూరుకు పెట్టారని గుర్తుచేశారు. ఈ రోజు వైస్సార్ కడప కేవలం వైస్సార్ జిల్లాగా మార్చారన్నారు. ఏ ప్రభుత్వమైనా పాలసీ నిర్ణయం తీసుకున్నప్పుడు అన్ని ఆలోచించాలని జనసేనాని సూచించారు. కృష్ణాజిల్లా కూడా ఎన్టీఆర్ జిల్లా అని పెట్టారని, కృష్ణా తీరం ఎక్కువగా వున్న చోట ఎన్టీఆర్ జిల్లా అన్నారన్నారు. అక్కడే వంగవీటి డిమాండ్ వచ్చిందన్నారు. ఇలాంటి పేర్లు పెట్టేటప్పుడు సున్నితంగా వ్యవహరించాలని హితవు పలికారు. కోనసీమకు ఆ రోజు పేరు పెట్టకుండా ఇప్పుడు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లో చెప్పాలని కోనసీమలో అడిగారని పేర్కొన్నారు. నిజానికి కోనసీమపై బ్రిటీష్ ప్రభావం కంటే అక్కడి వారి సంస్కృతి ప్రభావం ఎక్కువ అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
పోలీసులు ఎందుకు ప్రేక్షక పాత్ర వహించారు …
గొడవ జరగటం గురించి ప్రభుత్వానికి, పోలీసులకు తెలీదా అని సూటిగా ప్రశ్నించారు. వైసీపీ గొడవలు చేయిస్తూ ఇతర పార్టీల మీద నిందలు వేయడం తగదన్నారు. వైసీపీ ఎమ్మెల్సీ చేసిన దారుణం అందరికీ తెలుసు. ఆ ఇష్యూని పక్కదారి పట్టించేందుకే మరొక గొడవ చేయిస్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వం దళితుల్ని రాజకీయ ప్రయోజనాల కోసమే వాడుకుంటున్నారు… అంబేద్కర్ పేరుని రాజకీయ లబ్ది కోసం ఉపయోగిస్తున్నారు. ఎస్సీ సబ్ ప్లాన్ గురించి ప్రభుత్వం ఏమి మాట్లాడదు. రాష్ట్ర హోమ్ మంత్రి కొనసిమ గొడవలు వెనుక జేనసేన వుంది అంటున్నారు..అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ వుందా అని అనుమానం కలుగుతుందన్నారు. అధిక సంఖ్యలో ఎస్ సి యాట్రసిటీ కేసులు మన రాష్ట్రంలో నమోదు అవుతున్నాయి. కోడి కత్తి కేసు దర్యాప్తు ఎక్కడ వరకు వచ్చింది.. వైఎస్ వివేకా హత్య కేసులో పురోగతి ఎం సాధించారు..ఆంధ్ర రాష్ట్రంలో కులాల ఘర్షణ వైసీపీ పెడుతుందన్నారు. గతంలో బోగీలు వైసీపీ తగలబెట్టి మరొక పార్టీ మీద నింద వేశారు..