టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత , విజయ్ దేవరకొండ కలిసి ఖుషి సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కశ్మీర్లో వేగంగా జరుగుతుంది. అయితే ఈ క్రమంలో ఓ సీన్ తీస్తుండగా. సమంతా, విజయ్ దేవరకొండ షూటింగ్లో గాయపడినట్లు సమాచారం. జాతీయ మీడియా కథనాల ప్రకారం గాయపడ్డ వీరిద్దరినీ వెంటనే ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించినట్లు తెలుస్తోంది. ఒక యాక్షన్- ప్యాక్డ్ సన్నివేశం కోసం షూటింగ్ చేస్తున్నప్పుడు ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో షూటింగ్ కొన్ని గంటలపాటు నిలిపివేయవలసి వచ్చింది. సమంత, విజయ్ కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో స్టంట్ సీక్వెన్స్ చేస్తున్న సమయంలో ఇద్దరికీ గాయాలయ్యాయి. సన్నివేశం చాలా టఫ్‌గా ఉంది. ఆ సీన్ కోసం సమంత విజయ్ నదికి రెండు వైపులా కట్టిన తాడుపై వెహికల్ నడపవలసి వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు, వాహనం నదిలో లోతైన నీటిలో పడిపోయింది. దీంతో ఇద్దరి వెన్నుముకలకు గాయాలయ్యాయి” అని విజయ్ దేవరకొండ బృందం ప్రతినిధి ఒకరు చెప్పినట్లు సమాచారం.
సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం, ప్రమాదం జరిగిన వెంటనే టీనటులిద్దరినీ వెంటనే దాల్ సరస్సు ఒడ్డున ఉన్న హోటల్‌కి తరలించారు. ఫిజియోథెరపిస్ట్‌లను పిలిపించారు. చికిత్స అందిస్తున్నారు. ఖుషి షూటింగ్ సమయంలో వీరిద్దరూ కొన్ని ఎదురుదెబ్బలను ఎదుర్కోవలసి వచ్చింది. సమంత విజయ్ను వెంటనే శ్రీనగర్‌లోని దాల్ సరస్సు ఒడ్డున ఉన్న హోటల్‌కు తరలించారు. ఫిజియోథెరపిస్ట్‌లను పిలిపించారు. థెరపీ జరుగుతోంది,” అని సిబ్బంది తెలిపారు. ” భారీ భద్రత దృష్ట్యా.. వీరిద్దరి సీన్లకు సంబంధించి షూటింగ్ నిర్వహిస్తున్నారు. ఎవరినీ వారి దగ్గరికి రానివ్వడం లేదు.” అని షూటింగ్ సిబ్బంది తెలిపారు.
విజయ్ దేవరకొండ, సమంత జంటగా ఓ ప్రేమకథా చిత్రాన్ని శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ప్రస్తుతం కశ్మీర్ లోయలోని పలు అందమైన లొకేషన్లలో షూటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సినిమాకు ‘ఖుషి’ అనే పేరు ఖరారు ఫిక్స్ చేస్తూ.. ఇటీవలే అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్ ను విడుదల చేశారు. ఆ పోస్టర్లో విజయ్ స్టైలిష్ లుక్‌లో.. సమంత సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు కశ్మీర్ నేపథ్యంలో సాగే ప్రేమ కథా చిత్రమిది. దీన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ ఏడాది డిసెంబర్ 23న విడుదల చేయనున్నారు. విజయ్ దేవరకొండ కెరీర్లో 11వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. మహానటి తర్వాత సామ్, విజయ్ కలిసి నటిస్తున్న ప్రాజెక్ట్ కావడంతో మరింత ఆసక్తి నెలకొంది…!!
ఐతే ఈ వార్తలపై ఖుషి చిత్ర యూనిట్ స్పదించింది. పీఆర్ టీమ్ దినిపై వివరణ ఇచ్చింది. ”ఖుషి సినిమా షూటింగ్ లో విజయ్ దేవరకొండ, సమంత లకు గాయాలు అయినట్టు కొన్ని వెబ్ సైట్ లల్లో వార్తలు వస్తున్నాయి. అందులో ఎలాంటి వాస్తవం లేదు. టీం అంతా సక్సెస్ ఫుల్ గా కాశ్మీర్ లో 30 రోజుల షూటింగ్ కంప్లీట్ చేసుకొని నిన్న నే హైదరాబాద్ తిరిగి వచ్చారు. రెండో షెడ్యూల్ అతి త్వరలోనే మొదలు కానుంది. దయచేసి ఎలాంటి పుకార్లు నమ్మొద్దు” అని క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈ వార్తలకు తెరపడింది.
