ఒంగోలు మినీ స్టేడియం ఇచ్చేందుకు ప్రభుత్వం నిరాకరణ
టిడిపి మహానాడు కార్యక్రమం మండువారి పాలెంలోనే మహానాడు నిర్వహణకు అధిష్టానం నిర్ణయం తీసుకున్నారు. ఒంగోలు సమీపంలోని మండువారిపాలెం రెవెన్యూ విలేజ్ పరిధిలో….త్రోవగుంట ప్రాంతంలో 27,28 తేదీల్లో మహానాడు జరుగనుంది. మహానాడు నిర్వహణపై టిడిపి అధినేత చంద్రబాబు పార్టీ కమిటీలతో సమీక్ష నిర్వహించారు. వర్షాలు వచ్చే అవకాశం ఉందన్న ఆలోచనతో మహానాడు నిర్వహణకు టిడిపి ఒంగోలు లోని మినీ స్టేడియం ఇవ్వాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసింది. అయితే చివరి నిముషం వరకు నాన్చి…స్టేడియం ఇవ్వడానికి ప్రభుత్వం నిరాకరించింది. దీంతో టిడిపి మొదట తాము పరిశీలించిన మండువారిపాలెం గ్రామ సమీపంలోని బృందావన్ ఫంక్షన్ హాల్ ప్రాంతంలోనే మహానాడు నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, రాష్ట్ర భవిష్యత్ కు టిడిపి అవసరాన్ని చాటేలా మహానాడు ఉండాలని ఆయన అన్నారు. మహానాడుకు సమయం దగ్గరపడుతున్న కారణంగా పనులు వేగవంతం చెయ్యాలని అధినేత సూచించారు.