రాష్ట్ర వ్యాప్తంగా 55 వేల 607 అంగన్‌వాడీ కేంద్రాల్లోని దాదాపు 30.16 లక్షల మంది గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లలకు ప్రతి సంవత్సరం 1863.11 కోట్ల వ్యయంతో చేపట్టిన వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాల ద్వారా ఎంతో ప్రయోజనకరం పొందుతున్నాయని రాష్ట్రప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది.
పథకాలు ప్రవేశ పెడితే సరిపోదు.వాటి అమలు..పర్యవేక్షణ ఎంతో అవసరం..మరి ఎవరు వీటిని పరిశీలిస్తున్నారు..అంత తీరిక లేనప్పుడు పథకాలు ప్రవేశపెట్టి మమ అని అనిపించుకోవడం ఎందుకు.
ప్రజల సంక్షేమం అంటూ పధకాలను ప్రవేశపెడుతున్నారు.వాటిని పట్టించుకునే నాధుడే కరువయ్యాడు.
మన్యంలో గిరిజనుల్లో రక్తహీనత నివారణకు ప్రభుత్వం సంపూర్ణ పోషకాహార కల్పనకు చర్యలు చేపడుతోందని చెప్పుకుంటోంది. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పాలు, గుడ్లు, నిత్యావసర సరకులు ప్రతినెలా ఇస్తోంది. అయితే టెండర్‌దారులు నిర్లక్ష్యంగా గిరిజనులకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా కుళ్లిన గుడ్లు సరఫరా చేస్తున్నారు. సంపూర్ణ పోషకాహార కల్పనకు ప్రభుత్వం చర్యలు చేపట్టి మమ అనిపించుకుంది. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లోపంతో ప్రవేశపెట్టిన పధకాలన్నీ కూడా నీరుగారిపోతున్నాయని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డుంబ్రిగుడ మండలంలోని కొర్రాయి పంచాయతీ పెదఅంజోడలో గిరి చిన్నారులు, బాలింతలు, గర్భిణులు పంపిణీ చేసిన గుడ్లు కుళ్లిపోయి ఉండడంతో గిరిజనులు ఆందోళనకు గురయ్యారు. గుడ్లు సరఫరా చేసే గుత్తేదారుపై చర్యలు తీసుకోవాలని బాలింతలు, గర్భిణులు కోరుతున్నారు. ప్రతినెలా నాణ్యమైన సరకులు పంపిణీ చేయాలని విన్నవిస్తున్నారు.
ఎంతసేపు 2024 లో మళ్ళీ ఎన్నికలలో గెలవాలనే తాపత్రయం తప్పా….ప్రస్తుతం మన ముఖ్యమంత్రి వైయస్ . జగన్ మోహన్ రెడ్డి,,ఆయన మంత్రలకు వేరే ధ్యాస లేకుండా పోయిందంటూ..ప్రజలు విమర్శిస్తున్నారు.