సొంత నియోజకవర్గానికి తాగునీరు ఇవ్వలేని సీఎం రాష్ట్రాభివృద్ధి ఏమి చేస్తారు అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. తప్పులు ఎత్తి చూపిస్తుంటే మాత్రం ఎల్లో మీడియా అని ముద్ర వేస్తున్నారన్నారు. జగన్ శాడిజం, అరాచకం, విధ్వంసాన్ని ప్రజలు చూస్తున్నారన్నారు . కడపలో టీడీపీ అధినేత చంద్రబాబుకు టీడీపీ కార్యకర్తలు, నేతలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. అనంతరం జరిగిన కడప కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. సీఎం జగన్ ప్రజలపై సైకోలను వదిలారని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఆ సైకోలనూ వదలం, వడ్డీతో సహా తీర్చుకుంటామని హెచ్చరించారు. మూడేళ్ళ జగన్ పాలన పూర్తిగా విఫలమయిందన్నారు. ప్రజలందరిపై బాదుడేబాదుడు అంటూ మోయలేని భారాన్ని వేశారన్నారు. ఒంగోలులో నిర్వహించే మహానాడుకు స్టేడియం ఎందుకు ఇవ్వలేదు అని ప్రశ్నించారు. ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది..ఇక దీన్ని ఎవరూ ఆపలేరని హెచ్చరించారు. జగన్ లాంటి నియంతలకు భయపడేది లేదని హెచ్చరించారు. రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ తెచ్చారా ?కర్నూల్ సోలార్ ప్రాజెక్ట్ టీడీపీ హయాంలో వచ్చిందని గుర్తు చేశారు. ఆ ప్రాజెక్ట్ విషయంలో తనపై ఆరోపణలు చేసి ఆ కంపెనీని ఇబ్బంది పెట్టి ఇప్పుడు ప్రారంభం చేశారు. మూడేళ్ల క్రితం కర్నూల్ సోలార్ ప్రాజెక్ట్ పూర్తయ్యి ఉంటే ఈ రోజు పవర్ కష్టాలు ఉండేవి కాదన్నారు.
జాబ్ లెస్ క్యాలెండర్ ఇచ్చారు. రాయలసీమ స్టీల్ ప్లాంట్ కు టీడీపీ ఫౌండేషన్ వేసింది…కానీ జగన్ మళ్ళీ పక్కన ఫౌండేషన్ వేసుకున్నాడు. జగన్ ఫౌండేషన్ బదులు ప్రారంభం చేసి ఉంటే బాగుండేది. గత ప్రభుత్వం కట్టిన టాయిలెట్స్ కు కూడా రంగులు వేసుకున్న ప్రభుత్వం ఇది అని ఎద్దేవా చేశారు. సీమకు ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు తెచ్చింది ఎన్టీఆర్ ప్రభుత్వం అన్నారు. జగన్ గండికోట నిర్వాసితులకు 10 లక్షల పరిహారం ఇచ్చారా ? అని ప్రశ్నించారు. వివేకాను హత్య చేసి గుండెపోటు అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ ప్రభుత్వంలో ఉద్యోగులకు, పోలీసులకు కనీసం జీతాలు కూడా రావడం లేదన్నారు. ప్రజల్లో తీవ్ర బాధ, అవేదన ఉంది. గుంటూరు మహిళ వెంకాయమ్మ ప్రభుత్వం తీరును తేల్చి చెప్పింది. అలాంటి ఆమె ఇంటికి వెళ్ళి దాడి చేశారు. గ్రామాల్లో చెలరేగుతున్న సైకోలకు వడ్డీతో సహా చెల్లిస్తా ? అని హెచ్చరించారు.
జగన్ రాజ్యసభ ఎవరికి ఇచ్చారు…ఇద్దరు తెలంగాణ..ఇద్దరు ఆంధ్ర వాళ్ళు కు ఇచ్చారు… అంటే ఇది సమన్యాయం అన్నారు. రాజ్యసభ ఇచ్చిన వాళ్ళలో ఇద్దరు టీడీపీ నుంచి వెళ్లిన వాళ్ళు అన్నారు. సీబీఐ కేసుల్లో వాదించిన వారికి, తనతో కేసుల్లో ఉన్న వారికి జగన్ రాజ్యసభ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ ఇవ్వడానికి సమర్థులు, వెనుకబడిన వర్గాల వారు లేరా ?
పులివెందులలో బస్ స్టాండ్ కట్టలేదు కానీ మూడు రాజధానులు కడతారా ? అన్నమయ్య ప్రాజెక్ట్ సరిగా నిర్వహించని కారణంగా ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది. ప్రాజెక్ట్ కొట్టుకుపోవడంతో మూడు ఊళ్లలో ఇళ్లు దెబ్బతిన్నాయి..కొట్టుకుపోయిన మూడు ఊళ్లలో ఇళ్ళు కట్టలేని జగన్ రాష్ట్రంలో 30 లక్షల ఇళ్లు కడతారా ? అని ఎద్దేవా చేశారు.