గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో ప్రజల స్పందన వింటున్న మన నాయకులు రక రకాల అనుభవాలను పొందారు…ఓ పక్క మీరేం చేశారు మాకు అని రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తుంటే…మన నాయకులేమో …. ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారని…కావాలి జగన్..రావాలి జగన్ అంటూన్నారని తెగ గొప్పలు చెప్పుకుంటున్నారు. మంచినీటి సదుపాయాలు లేవని కొందరు తెలిపితే..రోడ్లు బాగోలేదని మరికొందరు, కొన్ని పధకాలు అందట్లేదని ఇంకా కొంతమంది ….ఇలా ఎవరికి వారు తమ సమస్యలను చెప్పుకుంటుంటే మన నాయకులు మాత్రం ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారని చెబుతున్నారు.
ఇదిఇలా వుంటే……. రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రకు ఏపీ మంత్రులు సిద్ధమవుతున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మంత్రులతో బస్సు యాత్ర నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు ఈ యాత్ర కొనసాగనుందని…బస్సు యాత్రలో 17 మంది మంత్రులు పాల్గొంటారని ప్రభుత్వం తెలిపింది. ఈ యాత్ర కోసం ప్రత్యేకంగా 2 బస్సులను సిద్ధం చేశారు. విశాఖపట్నం నుంచి ప్రారంభం కానున్న ఈ యాత్ర అనంతపురంలో ముగియనుంది.
రాష్ట్రంలోని ముఖ్యమైన పట్టణాలు, నియోజకవర్గాలు, మండల కేంద్రాల మీదుగా బస్సు యాత్ర సాగనుంది. ఈ మేరకు రూట్ మ్యాప్ సైతం సిద్ధం చేశారు. శ్రీకాకుళం, రాజమండ్రి, నరసరావుపేట, అనంతపురంలో బహిరంగ సభలు ఏర్పాటు చేసి మంత్రులు ప్రసంగించనున్నారు.గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం విజయవంతం అయ్యిందని చెప్పుకుంటున్న మన నాయకులు ఇప్పుడు బస్సు యాత్ర గురించి ఏం చెప్తారో చూడాల్సిందే………అంటున్నారు రాష్ట్ర ప్రజలు.కాలి నడకన వస్తూ అడుగుతున్న సమస్యలకే దిక్కులేదు..ఇప్పుడు బస్సుయాత్ర అంటా….అంటూ ప్రజలు ఘటూగా స్పందిస్తున్నారు.