మోడీ ప్రభుత్వం ఎనిమిదేళ్ల పాలన ముగిసిన నేపధ్యంలో దేశవ్యాప్తంగా పదిహేను రోజుల పాటు అన్ని చోట్లా పెద్ద ఎత్తున పార్టీ తరఫున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర మంత్రులు అంతా పాలుపంచుకుని కేంద్రంలోని మోడీ సర్కార్ ఈ ఎనిమిదేళ్ళలో దేశానికి ఏం చేసింది అన్న సంగతిని చెబుతారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రులు జై శంకర్, శర్వానంద్ విశాఖలో పర్యటించి, మోడీ ప్రభుత్వ విజయాల గురించి వివరిస్తారు.
ఎనిమిదేళ్ల మోడీ దేశానికి ఏమి చేశారు అన్నది మంత్రులు విడతల వారీ పర్యటనలో చెప్పదలచుకున్నారు. ఒక విధంగా చూస్తే బీజేపీ తెలుగు రాష్ట్రాల మీద ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా విశాఖ వంటి మెగా సిటీలో పట్టు పెంచుకోవాలని చూస్తోంది అని తెలుస్తోంది.