దేశభవితను కాపాడగల సత్తా యువతకి విద్యతోనే వస్తుందని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. నెల్లూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో స్నాతకోత్సవం నిర్వహించారు. పీహెచ్‌డీ, పీజీ విద్యార్థులకు గవర్నర్ గోల్డ్ మెడల్స్, పట్టాలు అందజేశారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ యువత ఉన్నత చదువులు చదివి ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. దేశవ్యాప్తంగా ఇటీవల ఉన్నత విద్య అందుబాటులోకి వచ్చిందన్నారు. యువత నైపుణ్యం పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. 2025 నాటికి దేశంలో 1.2 కోట్ల మంది యువత స్కిల్ డెవలప్‌మెంట్‌లో శిక్షణ పొందాలని గవర్నర్ తెలిపారు. యూనివర్సిటీలో చదువు పూర్తి చేసి దేశవిదేశాలకి వెళ్తారని ఎక్కడికి వెళ్లినా మాతృభూమిని మర్చిపోవద్దని, సామాజిక బాధ్యతని తప్పకుండా పాటించాలని విద్యార్థులకు సూచనలు చేశారు. దేశం కోసం పోరాడిన స్వతంత్ర సమరయోధులని ఆదర్శంగా తీసుకోవాలని గవర్నర్ పేర్కొన్నారు.





