తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఏపీ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్, మహిళా గవర్నర్ హరిచందన్ తో సమావేశమయ్యారు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం విఐపి లాంజ్‌లో ఏపి గవర్నర్ దంపతులతో తమిళిసై మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. భువనేశ్వర్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ మహా సంప్రోక్షణ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ హరిచందన్ అక్కడి నుండి తిరిగి విజయవాడ చేరుకునే క్రమంలో హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లో అనుసంధాన విమానం కోసం వేచి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇరురాష్ట్రాల గవర్నర్లు పలు అంశాలపై చర్చించారు. గవర్నర్ హరిచందన్ దంపతులను తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను ఘనంగా సన్మానించారు. తెలంగాణా గవర్నర్ ప్రత్యేకంగా విమానాశ్రయానికి చేరుకొని తనను మర్యాదపూర్వకంగా కలవడంవలన గవర్నర్ శ్రీ హరిచందన్ కృతజ్ఞతలు తెలిపారు. మూడు రోజుల ఒడిస్సా పర్యటన అనంతరం గవర్నర్ దంపతులు విజయవాడ రాజ్ భవన్ కు చేరుకున్నారు. రాజ్ భవన్ అధికారులు గవర్నర్ ను స్వాగతించారు.
