రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో జగన్ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యహరించడం కడు బాధాకరం.జగన్ సర్కార్ అధికారం చేపట్టిన దగ్గర నుండి రాష్ట్రవ్యాప్తంగా దౌర్జన్యాలు ఎక్కువ అయిపోయాయి.సామాన్యులు మీద దాష్టీకాలు,కబ్జాలు కూడా సామాన్యమైన విషయంగా మారిపోయింది,రక్షించాల్సిన పోలీస్ వారు సరైన సమయం లో స్పందించక పోవడం తో సామాన్యులకు న్యాయం అందనంత దూరం అయిపోతుంది.
మరిముఖ్యంగా వెనుకబడిన వర్గాల మీద ఈ దాష్టీకాలు అధిక సంఖ్యలో జరగడం కలవర పెట్టే అంశం అని చెప్పక తప్పదు. ఈ దౌర్జన్యాలు గిరిజనులు మీద అయితే బయటకు రాని వార్తలు కోకొల్లలు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో గిరిజన, యానాది సంఘాలు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఒకటి జరిగింది, ఈ కార్యక్రమంలో బాధితుల పరిస్థితి చూస్తే హృదయం ద్రవించక మానదు. స్థానిక మహిళ అన్నపూర్ణ ఆర్డీవో ఛాంబర్ నుండి బయటకు రాగానే ఆయన కాళ్ళు పట్టుకొని “అయ్యా! రౌడీ మూకలు మా గూడు ఆక్రమించుకుంటున్నారు దయచేసి రక్షించండి” అని వేడుకోవడం అందరినీ కన్నీళ్లు పెట్టించింది.స్థానికంగా రౌడీలు వీరి కుటుంబం పై దాడి చేస్తే హాస్పిటల్ లో జాయిన్ అయ్యి చికిత్స అనంతరం వస్తె తలదాచుకునే తమ గూడు కూడా ఆక్రమించేసారు అని బాధితురాలు వాపోయింది.
ఆర్డీవో వారికి భరోసా ఇచ్చినప్పటికీ పట్టణంలో రౌడీ మూకల అల్లరి ఎక్కువ అవుతుంది అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పోలీసులు వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని, వారి వెనుక అండగా ఉన్న నాయకుల పై కూడా తగిన చర్యలు తీసుకోవాలి అని ప్రజలు, గిరిజన సంఘాలు కోరుతున్నాయి.