రాష్ట్ర ప్రజల సంక్షేమానికి ఎన్నో పధకాలను ప్రవేశపెడుతున్నామంటున్నా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుతున్న వైద్య సేవలను పరిశీలస్తే తెలుస్తుంది…..ప్రజలకు ఏఏ సేవలు అందుతున్నాయో…….ఆరోగ్య కేంద్రాలు ఎంతబాగా పనిచేస్తున్నాయో అని …….
రాష్ట్రంలోని ‘ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు-పీహెచ్‌సీ ల్లో వైద్య సేవలు అరకొరగానే అందుతున్నాయి. ప్రధానంగా శస్త్రచికిత్సల విషయంలో వైద్యులు చేతులెత్తేస్తున్నారు. గతంలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు, ప్రసవాలు పీహెచ్‌సీల్లోనే అత్యధికంగా జరుగుతుండేవి. కానీ.. గత రెండు మూడేళ్లుగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పీహెచ్‌సీల్లో సరైన పరికరాలు, సౌకర్యాలు లేకపోవడం, వైద్య సిబ్బంది కూడా నిర్లక్ష్యంగా ఉండడంతో శస్త్రచికిత్సలు నామమాత్రంగానే జరుగుతున్నాయి.
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని పీహెచ్‌సీల్లో కూడా ఇదే పరిస్థితి.పీహెచ్‌సీలకు వచ్చే కేసుల్లో చాలా వాటిని విజయవాడ, మచిలీపట్నం ఆసుపత్రులకు వెళ్లాలని పంపించేస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 90 పీహెచ్‌సీలుండగా.. వాటిలో ప్రస్తుతం ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో 80వరకు ఉన్నాయి. నూజివీడు ప్రాంతంలో ఉన్నవి ఏలూరులో కలిసిపోయాయి. చాలా పీహెచ్‌సీల్లో సరైన వైద్య పరికరాలు, మందులు అందుబాటులో ఉండడం లేదు. దీంతో వచ్చిన వారిని వచ్చినట్టే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లిపోమంటూ సూచిస్తున్నారు. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలకు కూడా గుడివాడ ఏరియా ఆసుపత్రి లేదంటే దగ్గరిలో ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రాలు సీహెచ్‌సీలకు వెళ్లాలంటూ సూచిస్తున్నారు. అందుకే.. సీహెచ్‌సీల్లో మాత్రమే ప్రస్తుతం ప్రసవాలు, కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. రెండు జిల్లాల్లో కలిపి 11 సీహెచ్‌సీలున్నాయి. వీటిలో మాత్రం శస్త్రచికిత్సలు ప్రస్తుతం చేస్తున్నారు. తాజాగా జగ్గయ్యపేట సీహెచ్‌సీలో అన్నీ కలిపి.. మార్చిలో 58, ఏప్రిల్‌లో 46 శస్త్రచికిత్సలు చేశారు. పీహెచ్‌సీల్లోనూ ఇదే విధంగా ఏర్పాట్లు చేస్తే.. గ్రామీణ ప్రాంతాల్లోని గర్భిణులకు మేలు జరుగుతుంది.
చాలాచోట్ల ఒక్కో పీహెచ్‌సీకి ఇద్దరేసి వైద్యులు ఉన్నారు. ఉదయం ఓపీ చూడాల్సి ఉండగా..
. మధ్యాహ్నం నుంచి క్షేత్రస్థాయిలో పర్యటించాల్సి వుంది. స్థానికంగా ఉండే గర్భిణులు, రోగులకు క్షేత్రస్థాయిలోనికి వెళ్లి సేవలు అందించాలి. అధికారుల నిర్లక్ష్యమో లేక వీరి నిర్లక్ష్యమో తెలియదు కానీ….. చాలావరకూ వైద్యులు ఎవరూ క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లడం లేదు.
అసలు సాధారణంగా అయితే…….పీహెచ్‌సీలన్నీ ప్రస్తుతం 24గంటలూ పనిచేయాల్సి ఉంది. ఏ సమయంలో రోగులు వచ్చినా వైద్య సేవలు అందించాలి. కానీ.. 90శాతం పీహెచ్‌సీల్లో రాత్రి 9గంటల తర్వాత వైద్యులు, సిబ్బంది ఎవరూ అందుబాటులో ఉండడం లేదనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రాత్రి వేళ రోగులు వచ్చినా చూసేందుకు ఎవరూ ఉండడం లేదు. కొన్నిచోట్ల సిబ్బంది ఉంటున్నా.. రాత్రి వేళ వచ్చే వారిని విజయవాడ, మచిలీపట్నం తీసుకెళ్లాలంటూ సూచించడానికే పరిమితమవుతున్నారనే విమర్శలున్నాయి.
ఇదికేవలం 2 జిల్లాలకే పరిమితం కాదు…రాష్ట్రం మొత్తం ఇలానే వుందంటే…..యదా రాజా….తదా మంత్రులు,సంబంధిత అధికారులు అనవచ్చేమో………..