టీడీపీ మహానాడు సందర్భంగా ఒంగోలులో శుక్ర, శనివారాల్లో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నట్లు ప్రకాశం జిల్లా SP మల్లికా గార్గ్ వెల్లడించారు.ఒంగోలు లో విలేఖరుల సమావేశం లో మాట్లాడుతూ….ప్రజలందరూ ట్రాఫిక్ ఆంక్షలు పాటించి పోలీసులకు సహకరించాలని ఆమె సూచించారు.
మహానాడు కార్యక్రమానికి వెళ్లే వాహనాల మార్గాలు గురించి వివరించారు. గుంటూరు, విజయవాడ, చీరాల వైపు నుంచి మహానాడుకు వచ్చే వాహనాలు త్రోవగుంట ఫ్లై ఓవర్ పై కాకుండా బై లైన్/సర్వీస్ రోడ్‌లో ఎంటర్ అయ్యి కిమ్స్ అండర్ పాస్ ద్వారా విష్ణుప్రియ కళ్యాణ మండపం మీదగా పార్కింగ్ ఏరియాకు ఎంట్రీ అయ్యి మీటింగ్ ప్లేస్‌కు వెళ్లాలని సూచించారు.
నెల్లూరు, కావలి వైపు నుంచి మహానాడుకు వచ్చే వాహనాలు ఒంగోలు టౌన్‌లోకి ప్రవేశించకుండా పెళ్లూరు ఫ్లైఓవర్ ఎక్కి కిమ్స్ ఫ్లైఓవర్ పక్కన గల సర్వీస్ రోడ్డు నుండి కిమ్స్ అండర్ బైపాస్ పాస్ మీదగా విష్ణుప్రియ కళ్యాణ మండపం మీదగా పార్కింగ్ ఏరియాకు ఎంట్రీ అయ్యి మీటింగ్ ప్లేస్‌కు వెళ్లాలన్నారు. కడప, కర్నూలు, చీమకుర్తి వైపునుండి మహానాడుకు వచ్చే వాహనాలు కర్నూల్ బైపాస్ సెంటర్ మీదగా సర్వీస్ రోడ్డు ద్వారా విష్ణుప్రియ కళ్యాణ మండపం మీదగా పార్కింగ్ ఏరియాకు ఎంట్రీ అయ్యి మీటింగ్ ప్లేస్‌కు వెళ్లాలన్నారు.కొత్తపట్నం వైపు నుంచి వచ్చే వాహనాలు కొప్పోలు ఫ్లైఓవర్ మీదగా కిమ్స్ ఫ్లైఓవర్ పక్కన గల సర్వీస్ రోడ్డు నుండి కిమ్స్ అండర్ పాస్ మీదుగా విష్ణుప్రియ కళ్యాణ మండపం మీదగా పార్కింగ్ ఏరియాకు ఎంట్రీ అయ్యి మీటింగ్ ప్లేస్‌కు వెళ్లాలని తెలిపారు.
మహానాడు నుంచి బయటకు వెళ్లే వాహనాల మార్గాలను కూడా వివరించారు.మహానాడుకు వచ్చి పార్కింగ్ నుంచి గుంటూరు, విజయవాడ వైపుకు వెళ్లేందుకు ఎడమవైపు నుండి NH -16 రోడ్డులోకి ఎంట్రీ అయ్యి త్రోవగుంట ఫ్లైఓవర్ మీదుగా వెళ్లాలని సూచించారు.చీరాల వైపు వెళ్లే వాహనాలు త్రోవగుంట ఫ్లైఓవర్ అండర్ పాస్ నుంచి వెళ్లాలని,మహానాడుకు వచ్చి పార్కింగ్ నుండి వెళ్ళు వాహనాలు త్రోవగుంట ఫ్లైఓవర్ అండర్ పాస్ నుంచి యూటర్న్ తీసుకుని కావలి, నెల్లూరు వైపు గా NH 16లోకి ఎంట్రీ అయి వెళ్లాలని తెలిపారు.మహానాడుకు వచ్చి పార్కింగ్ నుండి వెళ్ళు వాహనాలు త్రోవగుంట ఫ్లైఓవర్ అండర్ పాస్ నుండి యూటర్న్ తీసుకుని నేరుగా కిమ్స్ ఫ్లైఓవర్ ఎక్కి, పెళ్ళూరు ఫ్లై ఓవర్ దిగి యూటర్న్ తీసుకుని, ఒంగోల్ మినీ బైపాస్ మీదగా కర్నూల్, కడప, చీమకుర్తి రోడ్డు గుండా ప్రయాణించాలని,ఒంగోలు టౌన్ నుంచి గుంటూరు, విజయవాడ వైపుకు వెళ్ళు వాహనాలు కొత్తపట్నం బస్టాండ్ వైపు నుండి కొప్పోలు ఫ్లై ఓవర్‌కు లెఫ్ట్ సైడ్‌లో గల సర్వీస్ రోడ్డు మీదగా ఎన్‌హెచ్ -16లోకి వెళ్లి గుంటూరు, విజయవాడ వైపు వెళ్లాలని వివరించారు.ఒంగోలు టౌన్ నుండి కావలి, నెల్లూరు వైపు వెళ్ళు వాహనాలు ఒంగోలు సౌత్ బైపాస్ మీదుగా రమేష్ సంఘమిత్ర హాస్పిటల్ మీదగా పెళ్లూరు ఫ్లై ఓవర్ అండర్ పాస్ ద్వారా NH-16మీదకు వెళ్లాలని,ఒంగోలు టౌన్ నుండి చీరాల వైపుకు వెళ్ళు వాహనాలు కొత్తపట్నం బస్టాండ్ మీదుగా కొప్పోలు ఫ్లైఓవర్‌కు లెఫ్ట్ సైడ్ లోని సర్వీస్ రోడ్డు ద్వారా NH-16 మీదుగా వెళ్లి, కల్వరి టెంపుల్ ఆపోజిట్ రోడ్‌లోని లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్డు ద్వారా త్రోవగుంట ఫ్లైఓవర్ అండర్ పాస్ నుంచి చీరాల రోడ్డు వైపు వెళ్లాలని…దీనికి ప్రజలు..ప్రయాణికులు.. నాయకులు..అందరూ సహకరించాలని కోరారు.