జగన్మోహన్ రెడ్డి 2019 లో అధికారంలోకి రావడానికి ఉపయోగపడిన అనేక వర్గాలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు మైనారిటీ వర్గాలు ముఖ్యమనే చెప్పాలి, మరిముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా బీసీ లు జగన్మోహన్ రెడ్డి వెనుక ఉండడం వల్ల అత్యధిక మెజారిటీ తో ముఖ్యమంత్రి పీఠం దక్కించుకున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ ల్లోని యువత ఓట్లు వైసీపీ ప్రభుత్వానికి బాగా ఉపయోగపడినాయి అని చెప్పక తప్పదు.
కానీ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తరవాత అత్యంత నిర్లక్ష్యం చేయబడిన వర్గాలు ఇవే కావడం గమనార్హం. పీజీ విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్మెంట్ తీసేయడం లాంటి అనాలోచిత చర్యల వల్ల ఇప్పటికే చాలా మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే వెనుకబడిన వర్గాల నిరుద్యోగ పిల్లలకు అత్యంత అవసరమైన “బీసీ స్టడీ సర్కిళ్” లను నిర్లక్ష్యం చేసి వారి ఉద్యోగ అవకాశాలను దూరం చేస్తున్నారు.
పేద నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడానికి ప్రత్యేకించి సివిల్స్,గ్రూప్ 1 మరియు 2 పోటీ పరీక్షల సాధనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1994 లో ఏర్పాటు అయిన బీసీ స్టడీ సర్కిళ్లు కొన్నేళ్లుగా నిర్లక్ష్యానికి గురైతున్నాయి. ప్రస్తుతం ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 13 ఉన్నాయి, ఆరు నెలల పాటు ఇచ్చే శిక్షణలో డిగ్రీ పూర్తయిన వెంటనే శిక్షణ తీసుకుంటే నోటిఫికేషన్ వచ్చే వరకు సాధన చేస్తూ ఉండొచ్చు అని నిరుద్యోగులు భావిస్తూ ఉంటారు, ఇక్కడ అందించే స్టడీ మెటీరియల్స్, కేంద్రంలో ఉండే గ్రంధాలయం విద్యార్థులకు చాలా ఉపయోగకరం గా ఉండేది, ఉమ్మడి రాష్ట్రంలో ఏడాది పొడుగునా గ్రూప్స్,బ్యాంకింగ్ తదితర పోటీ పరీక్షలకు ఈ కేంద్రాలలో శిక్షణా తరగతులు జరుగుతూ ఉండేవి, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు.
ఈ బీసీ స్టడీ సర్కిళ్ళల్లో 66% సీట్లు బీసీలకు మిగిలినవి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కేటగిరీ వర్గాల వారికి కేటాయించేవారు. దీనితో ఈ కేంద్రాలు అన్నీ రిజర్వడ్ కేటగిరీల వారికి ఇవి ఎంతో ఉపయుక్తంగా ఉండేవి, కోవిడ్ తరువాత ఈ శిక్షణా కార్యక్రమాలు పూర్తిగా ఆగిపోయాయి,
గ్రూపు 1 మరియు బ్యాంక్ పీఓ పోస్టులకు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వారికి రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వనున్నట్లు సాంఘిక సంక్షేమశాఖ సంయుక్త సంచాలకులు ఇటీవల ప్రకటన విడుదల చేశారు. కానీ బీసీ స్టడీ సర్కిళ్లు ఎప్పటి నుండి ప్రారంభమవుతాయి అని అధికారుల దగ్గర ఎలాంటి స్పష్టత లేదు.
జగన్మోహన్ రెడ్డి అధికారానికి కారణం అయిన బీసీ వర్గాలను,మరిముఖ్యంగా బీసీ యువతను ఇలా నిర్లక్ష్యం చేయడంతో అనేకమంది తమను కేవలం ఓటు బ్యాంక్ గానే చూస్తున్నారు తప్పించి తమకు విద్యా పరంగా అవసరమైన అనేక విషయాల్లో సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అని వాపోతున్నారు.