వైసీపీ ఫ్యాన్ గాలి దెబ్బకు చంద్రబాబు, లోకేష్ పిచ్చెక్కి తిరుగుతున్నారని, ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు అని ఏపీ పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్‌లో ఆమె మాట్లాడారు. ఎన్టీఆర్ మరణానికి కారణమైన వాళ్లే ఇప్పుడు ఫొటోకి దండం పెడుతున్నారని, మహానాడులో అయినా ఎన్టీఆర్‌కు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి అని మంత్రి రోజా డిమాండ్ చేశారు. మహానాడులో సీఎం జగన్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు చంద్రబాబు. కానీ, సీఎం జగన్ పార్టీలకతీతంగా సంక్షేమ ఫలాలు అందజేస్తున్నారన్నారు. తమ ప్రభుత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలూ లబ్ధి పొందుతున్నారన్నారు. 95 శాతం హామీలను సీఎం జగన్ అమలుచేశారు. అయితే మేనిఫెస్టోను వెబ్‌సైట్ నుంచి తీసేసిన ఘనుడు చంద్రబాబు అని రోజా ఎద్దేశా చేశారు. ఫ్యాన్ గాలి దెబ్బకు చంద్రబాబు, లోకేష్ పిచ్చెక్కి తిరుగుతున్నారన్నారు. మంచి చేశాం కాబట్టే ధైర్యంగా ప్రజల్లోకి వెళ్తున్నామన్న మంత్రి రోజా అంబేద్కర్ పేరు పెట్టాలని టీడీపీ, జనసేన ఎందుకు డిమాండ్ చేశాయని ప్రశ్నించారు.
బాలకృష్ణ పరిస్థితి చూస్తుంటే బాధేస్తోంది
ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పై మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. బాలకృష్ణ పరిస్థితి చూస్తుంటే బాధేస్తోందన్నారు. నిమ్మకూరులో ఎన్టీఆర్‌ది పెద్ద విగ్రహం పెడతామంటున్నారని, బాలకృష్ణకు ఇన్నేళ్లు నిమ్మకూరు గుర్తుకురాలేదా అని ప్రశ్నించారు. 2019 వరకు తమరే అధికారంలో ఉన్నారు కదా, నిమ్మకూరును అభివృద్ధి చేయాలని అప్పుడు అనిపించలేదా ? అని నిలదీశారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని వాడుకుని చంద్రబాబు అధికారంలోకి వచ్చారని మంత్రి రోజా వ్యాఖ్యలు చేశారు.
						
									




								
				
				
			