‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ మూవీలో నాగరాజుగా అలరించిన సుధాకర్ కొమాకుల పండంటి బిడ్డకు తండ్రయ్యాడు. ఆయన భార్య హారిక సందెపోగు మే 14న అమెరికాలోని షికాగోలో మగబిడ్డను కన్నది. చిన్నారికి ‘రుద్ర’ అనే పేరు కూడా పెట్టేసుకున్నారు ఈ జంట. రుద్ర అంటే శివునికి మరో పేరు అనే విషయం మనకు తెలిసిందే. ఈ రోజు సుధాకర్, హారిక పెళ్లిరోజును పురస్కరించుకుని తమకు బిడ్డ పుట్టిన విషయాన్ని ఫేస్‌బుక్ పేజ్ ద్వారా షేర్ చేసుకున్నాడు. బాబును పొత్తిళ్లలో పొదివి పట్టుకున్న భార్యతో కలిసి తీయించుకున్న ఫోటోను షేర్ చేశారు. ” మా పెళ్లిరోజుకు వారం ముందు అబ్బాయి పుట్టాడని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఇది నాకు ఎంతో ప్రత్యేక సందర్భం ! శివుడికి మరో పేరైన రుద్ర అని బాబుకు పేరు పెట్టుకున్నాం. మా రుద్ర కొమాకులకు మీ ఆశీర్వాదాలు కావాలి.” అని రాసుకొచ్చాడు సుధాకర్.
In this article:harikasandepogu, marriageday, rudrakomakula, sudhakarkomakula, tollywood

Click to comment