ఏపీ పర్యాటకశాఖ మంత్రి రోజా నగరి నియోజకవర్గంలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి రోజా నియోజకవర్గంలోని గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. స్థానికులు కూడా తమకు ఉన్న సమస్యల్ని చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే రోజా పర్యటనలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది.
మంత్రి పుత్తూరు మండలం శిరుగురాజుపాలెంలో పర్యటించి స్థానికులతో మాట్లాడారు. ఈ క్రమంలో ఓ వృద్ధుడిని పలకరించారు. పింఛన్ వస్తుందా ..? అని అడిగారు. అతడు కూడా వస్తుందని సమాధానం చెప్పారు. ఆ తర్వాత అతడు రోజాకు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఆ పెద్దాయన పెళ్లి గురించి అక్కడ ప్రస్తావించేసరికి మంత్రి రోజా అవాక్కయ్యారు. పింఛన్ అడిగితే ఎలాగోలా ఇప్పిస్తాం, కానీ పెళ్లి చేయలేం కదా అంటూ వృద్ధుడితో అన్నారు. తనకు పింఛన్ వస్తుందని, కానీ తోడు, నీడా ఎవరూ లేరన్నారు. ఆ పెద్దాయన అడిగిన మాటకు మంత్రితో పాటూ, చుట్టుపక్కల జనాలు కూడా ఆశ్చర్యపోయారు.