విదేశాల్లో ఉంటూ దేశంలో అత్యున్నత న్యాయస్థానాన్ని, న్యాయమూర్తులను పచ్చి బూతులు తిట్టి మొత్తం న్యాయవ్యవస్థనే అపహాస్యం చేసిన పంచ్ ప్రభాకర్ అలియాస్ చీనేపల్లి ప్రభాకర్ రెడ్డిపై సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అతడు ఎక్కడ ఉన్నా అరెస్ట్ చేయాలని పలుసార్లు సీబీఐకి న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. అయితే, ఇంతవరకూ అతడ్ని సీబీఐ అరెస్ట్ చేయలేదు. అయితే, తాజాగా, పంచ్ ప్రభాకర్ దావోస్‌లో ప్రత్యక్షమయ్యారు. సీబీఐకి దొరకలేదు కాని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డితో ఫోటోలకు ఫోజులిచ్చాడు. పంచ్ ప్రభాకర్‌తో కలిసి దావోస్ లో దిగిన ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇదిలా ఉండగా, వైఎస్ఆర్సీపీ ఎంపీ, ఆ పార్టీ లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డితో దావోస్‌లో పంచ్ ప్రభాకర్ దావోస్‌లో కలిసి తీసుకున్న ఫోటో అంటూ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. న్యాయమూర్తుల్ని కించపరిచేలా అసభ్య పదజాలంతో దూషించిన పంచ్ ప్రభాకర్‌పై సీబీఐ కేసు నమోదుచేసిన ఇంత వరకూ అరెస్ట్ చేయలేదు. తాజాగా, మిథున్ రెడ్డితో పంచ్ ప్రభాకర్ ఉన్న ఫోటోను షేర్ చేసిన ఓ నెటిజన్ భారత ప్రధాన న్యాయమూర్తికి ట్యాగ్ చేశారు. న్యాయమూర్తులను దూషించిన ఆయనపై బ్లూకార్నర్ నోటీసు జారీ చేశాం. ఇంటర్‌పోల్ సహాయం కూడా కోరామని సీబీఐ పదేపదే చెబుతోంది కానీ పంచ్ ప్రభాకర్ మాత్రం ఎంచక్కా దేశ విదేశాలకు తిరుగుతూనే ఉన్నారు.