గృహ నిర్మాణాలకు సంబంధించి అర్బన్ ప్రాంతాల లేఔట్ లలో రోజు వారి పురోగతి కనిపించాలని, సంబందిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తే ముఖ్యమంత్రి ఊరందూరులో జగనన్న లేఔట్ స్వయంగా ప్రారంభించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అని దీన్ని యజ్ఞంలా పూర్తి చేసేలా ఉండాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి అన్నారు. గురువారం ఉదయం గూడూరు డివిజన్ వెంకటగిరి అర్బన్ లే ఔట్ ను, శ్రీకాళహస్తి డివిజన్ ఊరందూరు లే ఔట్ ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పర్యటించి అధికారులకు , ప్రజా ప్రతినిధులకు, కేటగిరి – 3 గృహాల గుత్తేదారులకు దిశానిర్దేశం చేశారు.
అనంతరం….వెంకటగిరి అర్బన్ లే ఔట్ పర్యటన లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… 2,152 గృహాలకు గాను ఇంకా ప్రారంభం కానివి 25 శాతం మేరకు 700 వరకు ఉన్నాయని లబ్దిదారులకు అవగాహన కల్పించి, ఐ సి ఐ సి ఐ బ్యాంకు తో ఎం ఓ యు లు చేయించి ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ఆర్డిఓ మురళీకృష్ణ మున్సిపల్, హౌసింగ్, ఇంజనీరింగ్ శాఖల సమన్వయంతో ముందుకెళ్ళాలని సూచించారు. బి బి ఎల్ నుండి 900 గృహాలు బేస్ లెవెల్ కు రావాల్సి ఉందని, బేస్ లెవెల్ లో ఉన్న 318 గృహాలు రూఫ్ లెవెల్ కు వచ్చే విధంగా రోజువారి పురోగతి ఉండాలని వీటిపై నోడల్ అధికారులు నిరంతరం దృష్టి పెట్టాలని సూచించారు. లబ్దిదారులు ఎవరైనా మరణించి ఉంటె వారి కుటుంబీకులకు అర్హత మేరకు మంజూరుకు చర్యలు చేపట్టారని అన్నారు.
కాగా….. లే ఔట్ పర్యటనలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ……….. ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా 167 ఎకరాలలో నిర్మించిన జగనన్న లే ఔట్ ను 6231 ప్లాట్లను జిల్లాలో స్వయంగా పంపిణీ చేశారని త్వరగా పూర్తి చేయాల్సిన బాద్యత అందరిపై ఉందని అన్నారు. శ్రీకాళహస్తి ఆర్డిఓ, మున్సిపల్ కమీషనర్, తహశీల్దార్లు సమన్వయంతో సమీక్షలు జరిపి పురోగతి చూపించాలని ఆదేశించారు. ప్రతి వారం పర్యటిస్తానని లే ఔట్ లలో రోజు వారి పురోగతి కనిపించాలని అన్నారు. శ్రీకాళహస్తి రూరల్ 313, అర్బన్ 2,853, ఏర్పేడు 1,017 గృహాలను మంజూరు చేస్తే మొత్తం 4,183 కు గాను ఇంకా 958 ప్రారంభం కాలేదని వాటిని వెంటనే ప్రారంభించేలా లబ్దిదారులకు అవగాహన కల్పించాలని సూచించారు.






