వారణాసి లోని జ్ఞాన్వాపి మసీదు ప్రాంగణంలో మే 17 నాటికి విచారణకు సర్వేను పూర్తిచేయాలని, ఇందుకు అన్ని వర్గాలు సహకరించాలని కోర్టు స్పష్టం చేయడంతో చేపట్టిన వీడియోగ్రఫీ సర్వే ముగిసింది.
మసీదులో 3 రోజుల సర్వేకు వారణాసి సివిల్ కోర్టు ఆదేశించగా విచారణకు ఒక రోజు ముందే ఆ ప్రక్రియ పూర్తైంది. మూడు రోజుల నుంచి భారీ భద్రత సర్వే జరిగింది. ప్రార్థన స్థలంలోని మూడు గోపురాలు, భూగర్భ నేలమాళిగలు, చెరువు తదితర ప్రదేశాలను సర్వే బృందం వీడియో తీసింది. ఈ సందర్భంగా సోమవారం ఉదయం మసీదులోని కొలనులో నీటిని పూర్తిగా తోడేయడంతో 12 అడుగుల శివలింగం బయటపడింది.
జ్ఞాన్వాపి మసీదు వెలుపలి గోడపై ఉన్న హిందూ దేవతా మూర్తులకు నిత్యం పూజలు చేసుకునేందుకు.. అనుమతి ఇవ్వాలని ఢిల్లీకి చెందిన ఐదుగురు మహిళలు వారణాసి కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో… దీనిపై వారణాసి సివిల్ జడ్జి కోర్టు స్పందించింది. వారణాసి సివిల్ జడ్జి కోర్టు అక్కడ వీడియోగ్రఫీ సర్వే నిర్వహించేందుకు అనుమతులు ఇచ్చింది. ఈ ఆదేశాలతో సర్వే నిర్వహించారు.దీంతో సోమవారం ఈ సర్వే ప్రక్రియ ముగిసింది.
జ్ఞాన్వాపి మసీదు వెలుపలి గోడపై ఉన్న హిందూ దేవతా మూర్తులకు నిత్యం పూజలు చేసుకునేందుకు…అనుమతి ఇవ్వాలని కోరుతూ ఢిల్లీకి చెందిన ఐదుగురు మహిళలు వారణాసి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన వారణాసి సివిల్ జడ్జి కోర్టు అక్కడ వీడియోగ్రఫీ సర్వేకు ఆదేశాలివ్వగా సోమవారం అనగా..మే 16 వ తేదీ ఈ ప్రక్రియ ముగిసింది.
ఇక,మసీదు ప్రాంగణంలోని కొలనుని నమాజ్ సందర్భంగా శుద్ధి చేసుకోడానికి వినియోగిస్తున్నారు అని లాయర్ శుభాష్ నందన్ చతుర్వేది తెలిపారు. ఇస్లామిక్ “వాజూ” లేదా శుద్ధి కర్మ కోసం ఉపయోగించే కొలనును తప్పనిసరిగా సీలు చేయాలని పిటిషనర్లు కోర్టును కోరారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన సివిల్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
అయితే… ప్రస్తుతానికి ఆ కొలనుని ఉపయోగించకుండా చూడాలని వారణాసి జిల్లా మేజిస్ట్రేట్‌ను సివిల్ కోర్టు ఆదేశించింది. ఆ ప్రాంతంలోకి ఎవరినీ వెళ్లనివ్వకుండా సీల్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈ ప్రక్రియను నిర్వహించారు. మొదటి రోజు రెండు గదులలో సర్వే ను చేపట్టారు. ఆదివారం కూడా ఈ సర్వే ను నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేసి …. ఈ సర్వేను నిర్వహించారు. స్థానిక కోర్టు ద్వారా బాధ్యతలు అప్పగించిన బృందానికి సహకరిస్తామని మసీదు నిర్వహణ కమిటీ హామీ ఇవ్వడంతో ఈ సర్వేను జాగ్రత్తగా నిర్వహించామని అధికారులు తెలిపారు.
అయితే అంతకుముందు…..కోర్టు తీర్పుపై స్టే కోరుతూ అంజుమన్ ఇంతేజ్‌మియా మసీదు కమిటీ శుక్రవారం వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం తిరస్కరించింది. కేసు ఫైల్‌ను చూడకుండా తాము నిర్ణయం తీసుకోలేమని స్పష్టం చేసింది. ఈ కేసు గురించి తనకు ఎటువంటి అవగాహన లేదని ఆయన పేర్కొన్నారు.. దీన్ని పరిశీలించిన తర్వాత లిస్టింగ్ చేస్తామని సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ స్పష్టం చేశారు.