ఇప్పటికి ఇద్దరు ఎండీలు మారినా సమస్యకు దొరకని పరిష్కారం
కొత్తగా వచ్చిన ఎండీ అయినా జీతాల సమస్యను పరిష్కరిస్తారని ఎదురు చూస్తున్న ఉద్యోగులు
బకాయిలు చెల్లించాలంటూ విధులు బహిష్కరించిన నగర పాలక సంస్థ ఉద్యోగులు
విద్యుత్ ఉద్యోగులు జీతం అడిగితే ఎస్మా
కాంట్రాక్టు, పార్టుటైమ్ ఉద్యోగులకు ఐదారు నెలలకు కూడా వేతనాలు చెల్లించకుండా జగన్ రెడ్డి ప్రభుత్వం వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారని పలువురు రాజకీయ నాయకులు మండిపడుతున్నారు.
వాన రావడం… ఉద్యోగులకు జీతాలు పడడం.. వైసీపీ ప్రభుత్వంలో అంతా దైవాదీనంగా మారింది అంటున్నారు..ఉద్యోగులకు జీతాలు చెల్లించకుండా జగన్ ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది.
జగనన్నా ప్రభుత్వంలో ఒప్పంద, పొరుగు సేవల ప్రతిపాదికన ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న 600 మంది ఉద్యోగులు ఆరునెలలుగా జీతాలకు నోచుకోవడం లేదు….
కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించిన తమకు జీతాలు చెల్లించడానికి చేతులు రావడం లేదని ఉద్యోగుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాంట్రాక్టు, పార్టుటైమ్ ఉద్యోగులకు ఐదారు నెలలకు కూడా వేతనాలు చెల్లించకుండా జగన్ రెడ్డి ప్రభుత్వం వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారని పలువురు రాజకీయ నాయకులు మండిపడుతున్నారు.
ఉపాధి కోర్సుల్లో శిక్షణ, వెంటనే ఉద్యోగం అంటూ ప్రచారం చేస్తున్న వైసీపీ ప్రభుత్వం, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు సకాలంలో వేతనాలు ఇవ్వకపోవడంతో వేతన జీవులకు వెతలు మొదలయ్యాయి. ఒక నెల అంటే ఏదో ఇబ్బంది అనుకుందాం…ప్రతి నెలా ఇదేం తంతు అంటూ ఉద్యోగులు మండిపడుతున్నారు. నెలంతా పని చేసినా సకాలంలో వేతనాలు ఇవ్వకపోతే… ఎలా అని ప్రశ్నిస్తున్నారు. పిల్లల చదువుల కోసం, ఇళ్ల రుణాలు, ఇతర ఆరోగ్య సమస్యల వల్ల రుణాలు తీసుకున్న ఉద్యోగులు ఈఎంఐల చెల్లింపులు కటాఫ్ డేట్‌గా ఐదో తేదీని పెట్టుకుంటారు. నెలలో ఐదవ తేదీ దాటితే…వారి క్రెడిట్ స్కోర్ పడిపోతుంది. ఈఎంఐలు సకాలంలో కట్టకపోతే చెక్ బౌన్స్‌లు అవుతాయి. ఇక విశ్రాంత ఉద్యోగుల పరిస్థితి మరింత దయనీయం.
జగన్న ప్రభుత్వంలో ‘‘నెలంతా విధులు నిర్వహించిన వారికి ఆ తర్వాత నెల 1వ తేదీన జీతం పొందే ఆనవాయతీ పూర్తిగా తప్పిపోయింది. పని చేసిన కాలానికి 1వ తేదీన వేతనం పొందలేకపోవడంతో వేతన జీవులు ఉద్యోగులు ఆర్థికంగా సతమతమవుతున్నారు. పండగలు, విపరీతంగా పెరిగిన ధరలు, ఇంటి అద్దెలు, పిల్లల ఫీజుల చెల్లింపులు…ఇలా అన్ని నిర్దిష్ట తేదీల్లో ఉద్యోగులు కట్టాల్సి ఉంటుంది. జీతాలు ఎందుకు పడలేదంటే సరైన సమాధానం చెప్పేవారు కూడా కనిపించడం లేదు’’
పని చేసే ఉద్యోగులకు ఆరు నెలలుగా జీతాలు రాక అవస్థలు పడుతున్నారు.
అధికారులు మాత్రం జీతాలు త్వరలోనే వస్తాయని చెప్తూ రెండు, మూడు నెలలుగా సమాధానం దాటవేస్తున్నారు.
అప్పులతో నెట్టుకొస్తున్నాం -ఉద్యోగులు
కాంట్రాక్టు జాబ్ పైనే ఆధారపడిన వాళ్లు జీతాలు రాక అప్పుల పాలవుతున్నారు. నెలల తరబడి జీతాలు రాకపోవడంతో కుటుంబం గడవడం కోసం తెలిసిన వాళ్ల దగ్గర అప్పులు చేస్తూ నెట్టుకొస్తున్నారు. పండుగలను కూడా సంతోషంగా జరుపుకొలేని పరిస్థితి తమకు వచ్చిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జీతాలు వెంటనే ఇవ్వాలి- ఉద్యోగులు
ఉద్యోగులకు ఆరు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. నెలల తరబడి జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. జీతాల కోసం ఉన్నతాధికారులకు తెలియజేయడం జరిగిందని ఇప్పటికైనా సర్కారు స్పందించి పెండింగ్ లో ఉన్న జీతాలను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు..
ఒక్కొక్కరుగా సంస్థను వీడిపోతున్న ఉద్యోగులు
దీంతో ఆర్థిక ఇబ్బందులను తాళ్లులేని అనేక మంది ఉద్యోగం మానేసి వెళ్లిపోయినా ఇప్పటివరకు పెండింగ్ జీతాలు సెటిల్ చేయని నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులు… నవంబర్ 2021 లో మొదలైన జీతాల సమస్య తరువాత ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థలో ఇప్పటికి ఇద్దరు ఎండీలు మారినా సమస్యకు దొరకని పరిష్కారం అయింది..కొత్తగా వచ్చిన ఎండీ అయినా ఉద్యోగుల జీతాల సమస్యను పరిష్కారించాలని కోరుతున్నారు.
ఏలూరు-
ఇటివల నగరపాలక సంస్థలో విలీనమైన ఏడు గ్రామపంచాయతీ కార్మికులకు రావల్సిన ఐదు నెలల జీతాల బకాయిలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ అధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద కార్మికులు ధర్నా నిర్వహించారు. పారిశుధ్య కార్మికులకు నాలుగు నెలల హెల్త్ అలవెన్స్ బకాయిలు ఇంతవరకు చెల్లించకపోవడం దుర్మార్గమన్నారు. 370 మంది కాంట్రాక్టు ఉద్యోగులు, 200 మంది పర్మినెంట్ ఉద్యోగుల వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ యానాం మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు..
విజయవాడ –
రాష్ట్ర వ్యాప్తంగా ఏపి జెన్‌కో, డిస్కమ్ లో పనిచేస్తున్న విద్యుత్ ఉద్యోగులు వేతనలు చెల్లించాలలని విజయవాడ ఇబ్రహింపట్నం వద్దనున్న ఎన్టీటీపీఎస్ మెయిన్ గేట్ వద్ద ధర్నా నిర్వహించారు.. ఎన్టీటీపీఎస్ పనిచేస్తున్న ఇంజనీర్లు, ఓఅండ్ ఎం ఉద్యోగులు రూ. 2300 మందికి నెలకు 32 కోట్లు, జెన్‌కోలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్బికులకు రూ.12 కోట్లు చెల్లింపులు చేయాల్సి ఉందన్నారు. జీతాలు చెల్లించకపోతే ఉద్యమబాట పడతామన్న విద్యుత్ ఉద్యోగ సంఘాలను ఏకంగా ఈ సంస్థల్లో సమ్మెని సమ్మెలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది
-జీతం అడిగితే ఎస్మా –
ఇదీ ఉత్తర్వు..‘‘ఇప్పటికే విద్యుత్ రంగంలోని సంస్థల సేవలను ఎస్మా చట్టం మేరకు అత్యవసర సేవలుగా ప్రకటించడం జరిగింది. అయినా వాటి పరిధిలో ఆరు నెలల పాటు సమ్మెలను నిషేధించడం అవసరం, సముచితమని ప్రభుత్వం భావించింది. కాబట్టి అత్యవసర సేవల నిర్వహణ చట్టం(ఎస్మా)-1971లోని సెక్షన్2లోని సబ్ సెక్షన్ 1, 3ల మేరకు సమ్మెలను నిషేధిస్తున్నాం’’ అని ఇంధన శాఖ కార్యదర్శి ఉత్తర్వులు (జీవో నం.65) జారీ చేశారు.






