పెరిగిన ధరలు పెంచి ఇప్పుడు తగ్గించామని గొప్పలు చెప్పుకోవడం BJP కి తగదని CPI జిల్లా నాయకులు కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ……..కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడి ప్రభుత్వం గత 8 సంవత్సరముల నుండి పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు విపరీతంగా పెంచిందని ఆరోపించారు.
రూ.75/- ఉన్న పెట్రోల్ ను,, రూ.121/- కు పెంచింది. అట్లాగే రూ.60/ ఉన్న డీజిల్ ను రూ.112/ లకు వంటగ్యాస్ ను రు.550/- నుండి 1070/- లకు పెంచింది. అలాగే నిత్యావసర వస్తువుల ధరలను UPA ప్రభుత్వం ఉన్నప్పటితో పోలిస్తే BJP వచ్చిన తర్వాత ఒకటికి మూడు రెట్లుపెంచిందని మండిపడ్డారు.
పెరిగిన ధరలలో పెట్రోలపై రూ.8/-, డీజిల్ పైన రూ.6/-, వంటగ్యాస్ పైన రూ.200/మాత్రమే తగ్గించి ఛారిత్రత్మకమైన ధరల తగ్గింపు అంటూ మీడియాలో ప్రచార ఆర్బాటాలు చేయటం సిగ్గుచేటు అని విమర్శించారు.
ధరలు పెంచడంలో గుమ్మడి కాయంత పెంచి తగ్గించడంలో గురివింద అంత తగ్గించిందని ఆరోపించారు . బిజెపి అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిది సంవత్సరాల్లో 36 లక్షల కోట్లు పెట్రోలియం ఉత్పత్తులపై పన్నులు వసూలు చేసిందని అన్నారు. సంవత్సరానికి మూడు లక్షల 92 వేల కోట్లు ప్రజల నుంచి దండు కుంటుందని, చిత్తశుద్ధి ఉంటే పెట్రోలియం ఉత్పత్తులపై జిఎస్టి అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
