మూడు దశాబ్దాల కిందటి కేసులో మాజీ క్రికెటర్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు నవజోత్‌సింగ్ సిద్ధూకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు నిన్న తీర్పు వెలువరించిన నేపధ్యంలో ఆయన ఈ రోజు కోర్టులో లొంగిపోయారు. ఈ మధ్యాహ్నం పాటియాలాలోని తన నివాసం నుంచి జిల్లా కోర్టుకు వెళ్లిన ఆయన న్యాయమూర్తి ఎదుట లొంగిపోయారు. అనంతరం ఆయనను వైద్యపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత పాటియాలా జైలుకు తరలించనున్నారు.
మూడు దశాబ్దాల కిందటి కేసులో మాజీ క్రికెటర్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు నవజోత్‌సింగ్ సిద్ధూకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు నిన్న తీర్పు వెలువరించిన నేపధ్యంలో ….. కేసులో లొంగిపోవడానికి తనకు కొంత సమయం కావాలని కోరుతూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ కేసులో లొంగిపోయేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, అయితే ఆరోగ్య కారణాల రీత్యా తనకు కొన్ని వారాల సమయం ఇవ్వాలని సిద్ధూ న్యాయస్థానాన్ని కోరారు. అయితే ఈ కేసులో ప్రత్యేక బెంచ్ తీర్పు ఇవ్వడంతో తాజా అభ్యర్థనపై తాము నిర్ణయం తీసుకోలేమని ధర్మాసనం తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ ఫైల్ చేయాలని సూచించింది.కాగా….34 ఏళ్ల క్రితం ఓ వృద్ధుడిపై దాడి చేసి అతడి మరణానికి కారణమైన కేసులో సిద్ధూకు ఏడాది జైలు శిక్ష పడింది.