ఆమ్ ఆద్మీ పార్టీ AP ఇంఛార్జ్ మణి రత్నం నాయుడు చంద్రగిరి నియోజకవర్గం ఇంచార్జి గా విరూపాక్షి నవీన్ కుమార్ రెడ్డి ని నియమించారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ………చంద్రగిరి టౌన్ లో సభ్యత్వ నమోదు… కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని.. స్వచ్చందంగా పార్టీలో సభ్యులుగా చేరుతున్నారన్నారు.అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేశారు.ప్రజల్లో విశేష స్వందన ఉందని తిరుపతి జిల్లా పార్టీ కన్వీనర్ నీరుగట్టు నగేష్ పేర్కొన్నారు.చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి నూతనంగా చంద్రగిరి నియోజకవర్గ ఇంఛార్జర్ గా విరూపాక్షి నవీన్ రెడ్డినిఎన్నుకోవడం జరిగిందని వెల్లడించారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ నాయకత్వం దేశం మొత్తం కోరుకుంటోందని,,, ఆమ్ ఆద్మీ పార్టీలో సభ్యులుగా చేరాలని ఢిల్లీ, పంజాబ్ తరహా ప్రభుత్వాలను ఆంధ్రప్రదేశ్ లో నిర్మించాలని రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఆర్. మణినాయుడు ఆదేశాలను ప్రతి కార్యకర్త పాటించి సభ్యత్వ క్యాంపెయిన్ లో విరివిగా పాల్గొని సభ్యత్వ నమోదు చేయించాలని రాష్ట్ర సీనియర్ నాయకులు వెంకటాచలపతి అన్నారు.చంద్రగిరి తిరుపతి జిల్లా కమిటీ సమక్షంలో సభ్యత్వ కాంపెయిన్ ప్రారంభించడం జరిగిందని, పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి కృషి చేయాలని తెలిపారు.
అనంతరం నూతన చంద్రగిరి నియోజకవర్గం ఇన్చార్జి నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ………. తనపై నమ్మకంతో చంద్రగిరి నియోజకవర్గం ఇంచార్జీగా నియమించినందుకు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఆర్. మణినాయుడుకు, రాష్ట్ర కమిటి సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో జిల్లాలో ప్రతి నియోజకవర్గం, మండల, గ్రామ, స్థాయికి పార్టీ నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. నీతివంతమైన, అవినీతి లేని పాలన ఏర్పాటు కొరకు ఆశక్తి కలిగిన వారు సామాజిక సంఘ సేవకులు, వివిధ వర్గాల ప్రజలు పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు. అలాగే పార్టీ బలోపేతం కోసం నాయకత్వం బాధ్యతలు చేపట్టడం కోసం ముందుకు రావాలన్నారు.చంద్రగిరి నియోజకవర్గంలో పార్టీలో సభ్యులుగా చేరడానికి టోల్ ఫ్రీ నెంబర్ 8004197874సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో రుక్మిణి యాదవ్ ..డాక్టర్ దువ్వూరి వెంకటేష్ ,ఖాదర్,హేమనాధ్ రెడ్డి,కె.జయంతి ,దిల్షాద్, కె.సురేష్ రెడ్డి,వి.హరి బాబు,గురునాధ్ రెడ్డి ,ఓ.చంద్రశేఖర్ రెడ్డి వేణుగోపాలచారి తదితరులు పాల్గొన్నారు.