ఆంధ్రప్రదేశ్ ను ప్రస్తుతం నిరుద్యోగ సమస్య పట్టిపీడిస్తుందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉమ్మడి అనంతపురం జిల్లాలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ….మూడేళ్ల వైకాపా పాలనలో ఆంధ్రప్రదేశ్‌కు ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా అని ప్రశ్నించారు. కొత్తగా రాష్ట్ర యువతకు ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో ప్రజలు ఒకసారి పరిశీలించాలన్నారు. ‘అనేక సంక్షేమ పధకాలు అన్నారు….రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టివేశారని పేర్కొన్నారు.‘ఇప్పటికే అనేక సంక్షోభాలు ఎదుర్కొన్నామని తెలిపారు.
రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే బాధ్యత యువత పై ఉందని, ఈ ఆశతో ప్రజలందరిలో మార్పు రావాలని పిలుపునిచ్చారు. సంపద సృష్టించడం తెలియని పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు . తమ హయాంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నో పరిశ్రమలు ముందుకొచ్చాయని…ఇప్పుడు వున్న పరిశ్రమలు కూడా మూసి వేసుకునే పరిస్థితి నెలకొందని చెప్పారు. రాష్ట్రంలో ఏర్పచబడిన పరిశ్రమలతో అనేక మందికి ఉపాధి కల్పించామని, వైకాపా పాలనలో పరిశ్రమల్లేవని,యువతకు ఉద్యోగాలు లేవని చెప్పారు. వైకాపా నేతల రౌడీయిజం చూసి రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు కూడా వెళ్లిపోయాయని….కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా రాలేదని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు.