గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు పరిధిలో అమరావతి టౌన్‌షిప్‌లోని 331 స్థలాల్ని ఇ-వేలంలో విక్రయించాలని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) నిర్ణయించింది. వీటిని 12 లాట్‌లుగా విభజించింది. 200 చదరపు గజాల ప్లాట్లు 23, 1000 చదరపు గజాల ప్లాట్లు -6 అందుబాటులో ఉన్నాయి అన్నారు. లాట్-1(12 లాట్లు) 29 ప్లాట్లు ఉండగా(200 చదరపు గజాల ప్లాట్లు – 23 మరియు 1000 చదరపు గజాల ప్లాట్లు – 6 ఈ-ఆక్షన్ ద్వారా నోటిఫికేషన్ జారీ చేసింది. Notification-01/Action 2022/MAU61-EEOEST(OTH) 75/2020, Dt:07-05-2022 తదితర వివరాలను ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ నందు అందుబాటులో ఉంచబడింది. ప్రభుత్వం నిర్ణయించిన ధర ఒక్కో చదరపు గజము రూ.17,800.
ఆసక్తి ఉన్నవారు ఈ-ఆక్షన్ వెబ్‌సైట్‌లో 13-05-2022 ఉదయం 11 గంటల నుంచి కొనసాగుతూ 27-05-2022 సాయంత్రం 5 గంటల వరకు తమ పేర్లు నమోదు చేసుకునే వెసులుబాటు ఉంది. వెచ్‌సైట్ వివరములు : కొనుగోలు పోర్టల్ https://konugolu.ap.gov.in & APCRDA website https://crda.ap.gov.in. ఆన్‌లైనులో దరఖాస్తులు సమర్పించే ఆఖరి తేదీ 27-05-2022, సాయంత్రం 5 గంటల వరకు https://konugolu.ap.gov.in అమరావతి టౌన్ షిప్స్ లో ప్లాట్లు కొనుక్కునే వారికి ప్రభుత్వం యూనియన్ బ్యాంకు మరియు ఐసిఐసిఐ బ్యాంకుల నుంచి రుణాన్ని తీసుకునే సౌలభ్యం కూడా కల్పించబడింది. అమరావతి టౌన్షిప్‌కి ఉత్తరం వైపు త్వరలో అందుబాటులోనికి రానున్న ప్రఖ్యాత అమృత విశ్వవిద్యాలయం, దక్షిణాన విజయవాడ-గుంటూరు పాత రహదారి. మంగళగిరి రైల్వే స్టేషన్‌కు కూతవేటు దూరంలో అమరావతి టౌన్షిప్ ఉన్నది.