భారతదేశానికి స్వాతంత్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా ప్రస్తుతం కేంద్రప్రభుత్వం ఆజాదీకా అమృత్ మహోత్సవాలను నిర్వహిస్తోంది. స్వాతంత్యం కోసం ఎంతోమంది అమరవీరులు తమ ప్రాణాలను సైతం లెక్కచెయ్యకుండా దేశం కోసం ఎంతో సేవ చేశారు. మరి అటువంటి వారిని స్మరించుకోవాల్సిన బాధ్యత భారత పౌరులుగా మనందరిపై ఉంది.
మరీ మన ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు కి అవమానం జరిగింది. ఒంగోలు కలెక్టరేట్ లో జరిగిన వ్యవసాయ సలహా మండలి సమావేశానికి మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జున విచ్చేశారు. అయితే ప్రకాశం పంతులు వర్థంతి సందర్భంగా ఆయన విగ్రహానికి కనీసం పూలమాలలు వేయకుండా వెళ్లిపోయారు. అధికారులు చెబుతున్నా…మంత్రులు పట్టించుకోకుండా వెళ్ళిపొయ్యారంటే,,దేశం మీద,దేశ భక్తుల మీద మన రాష్ట్ర నాయకులకు ఎంత భక్తి ఉందో తెలుస్తుంది.