భారత రాజ్యాంగ ప్రవేశిక ఒక్కసారి పరిశీలిస్తే ఈ దేశ రాజ్యాంగం ఎంతటి సమున్నతమైనదో దానికున్న విలువలేంటో మనకు స్పష్టంగా అర్ధమవుతుంది అందులో వివరంగా ఇలా చెప్పబడుతుంది ఈ దేశ ప్రజలైన మేము భారత రాజ్యాంగాన్ని మాకు మేము గా ఇచ్చుకుంటున్నాం సర్వసత్తాక గణతంత్ర లౌకిక ప్రజాస్వామ్య రాజ్యం గా ఏర్పాటు చేసుకున్నాం ఇక్కడి పౌరులందరికీ స్వేచ్ఛా న్యాయం సమానత్వం సౌబ్రాత్రుత్వం సమానంగా ఉంటుందని పేర్కొంటూ పౌరులందరికీ ప్రాథమిక హక్కులను ప్రసాదిస్తూ భారత రాజ్యాంగం 1950 జనవరి 26 తేదీన అమలులోకి వచ్చింది ఇంతటి ఉన్నతమైన విలువలను లౌకిక స్ఫూర్తిని భారత రాజ్యాంగం వరం గా ఈ దేశ ప్రజలకు ప్రసాదించింది.
ఐతే ఈ దేశం పై అనేక సంస్కృతులు ఇతర దేశాలు దండ యాత్ర చేసాయి వారి సాంస్కృతిక జీవనాన్ని ఇక్కడి వారికి పరిచయం చేసాయి అది తప్పా ఒప్పా పక్కనపెడితే కొన్ని వందల సంవత్సరాల నుండి వారు వారి సాంస్కృతిక జీవన విధానానికి కట్టుబడి వున్నారు అది ఈ దేశం ఆచారాలు కాకపోవచ్చు లేదా వాటికీ బిన్నంగా సాంస్కృతిక లేదా సామజిక విప్లవ ధోరణికి పరాకాష్టగా ఇక్కడి ఆచారాల్లోని లోపాలను ప్రశ్నిస్తూ పుట్టి ఉండవచ్చు ఏది ఎలా ఉన్న జురుస్ప్రుడెన్సీ అఫ్ లా అంటే కొన్ని సందర్భాలలో న్యాయ విజ్ఞతకు మూలం మతం కావచ్చు మెజారిటీ ప్రజలు మతాన్ని ధర్మ ఆచరణగా తీసుకుంటున్నప్పుడు వారి జీవం విధానం దానితో ముడి పడి వున్నపుడు న్యాయం కూడా ధర్మాన్ని పక్కన పెట్టదు.
అందుకే అనేక చట్టాలకు మూలం వారి ధర్మాచరణ ప్రతిపాదికిన నిలిచింది అనేక చట్టాలు వారి మతాన్ని ఆధారంగా చేసుకొని దానికి మారుతున్న కాలానికి తగ్గట్టు రాజ్యంగా విలువలను జోడిస్తూ శాస్త్రీయ పద్దతిలో ధర్మాన్ని న్యాయాన్ని సమం చేస్తూ చట్ట రూపకల్పన జరిగింది అందుకే చట్ట మూలాలు ఎక్కడో చోట మతాన్ని దాని తాలూకు సహేతుకతకు ప్రామాణికం గా ఉంటాయి ఐతే భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉంటే మాత్రం అది ధర్మచరణగా ప్రజా ఆచరణలో ఉన్నా చట్ట రూపం లో మాత్రం దానిని రాజ్యాంగం వ్యతిరేకించి నిలుపుదల చేస్తుంది అంటే భారత రాజ్యాంగం ధర్మాన్ని న్యాయాన్ని ప్రామాణికం గా తీసుకుంటుందే తప్ప దాని మీద పూర్తిగా ఆధార పడదు అవి రెండు కలగలిపి దానికి శాస్త్రీయ ధోరణితో ఉన్న తన స్వతంత్ర ప్రామాణికత తన ఉనికి ఎప్పటికి దేదీప్యమానం గా వెలుగుతూనే ఉంటుందని దాని అర్ధం. భారత రాజ్యాంగ ఔనత్యాన్ని చెప్పే కొన్ని కేసులు…
గోలక్ నాథ్ vs స్టేట్ అఫ్ పంజాబ్
ఈ కేసులో సుప్రీమ్ కోర్ట్ ధర్మాసనం స్పష్టం చేసిన విషయం ఏమిటంటే పౌరుని ప్రాథమిక హక్కులను హరించే లేదా తక్కువ చేసే అధికారం భారత పార్లమెంట్ కు లేదు అని తేల్చి చెప్పింది అంటే రాజ్యాంగం పౌరుని భద్రతకు విఘాతం కలిగినపుడు ఫోర్స్ లోకి వస్తుంది అని స్పష్టం చేసిన మన దేశ న్యాయ వ్యవస్థకు దాని రూపకల్పులకు ఈ దేశ ప్రజలు సర్వదా రుణపడి ఉంటారనటం లో సందేహం లేదు ఇంతటి విశాలమైన గౌరవమైన వ్యవస్త ప్రపంచం లో మరొకటి లేదు..
కేశవానంద భారతి vs స్టేట్ అఫ్ కేరళ
ఈ కేసు లో సుప్రీంకోర్టు భారత పార్లమెంట్ కు పార్ట్ ౩ లోని ప్రాథమిక హక్కులను అమెండ్ అంటే మార్పులు చేర్పులు చేసే అధికారం పార్లమెంట్ కు లేదు అని తేల్చి చెపింది గోలక్ నాథ్ కేసు లో చెప్పిన విధంగానే పార్లమెంట్ కు ఉన్న పరిమిత అధికారం లో మాత్రమే చట్ట రూపకల్పన జరగాలని భారత రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం పార్లమెంట్ కు లేదని తేల్చి చెప్పింది. చూసారా వ్యక్తి స్వేచ్చకు ఇంతటి ప్రాధాన్యత కల్పించిన దేశం ఈ ప్రపంచం లో మరొకటి కనపడదు ప్రశ్నించే తత్వాన్ని ఇస్తూనే కొన్ని పరిమితులను అపార స్వేచ్ఛను మనకు ప్రసాదించింది.
బాబ్రీ మస్జీద్ కేసు
బాబ్రీ మస్జీద్ కేసు ను మనం చూస్తే ఎన్నో సంవత్సరాలుగా జటిలమైన సమస్య గా ఉంటూ హిందూ ముస్లిం ల మధ్య అడ్డుగోడగా ఉన్న ఈ జంజాటాన్ని నరేంద్ర మోడీ చక్కని వివరణాత్మక ముగుంపు నిస్తూ ప్రజల్లో ఎక్కడ అశాంతి రేగకుండా జాగ్రత్త పడి ప్రపంచ దేశ మన్ననలు పొందారు ఈ కేసు లో బాబ్రీ మసీద్ ఉన్న స్థలం లో పూర్వం రాముని గుడి ఉండేదని హిందూ ప్రజల నమ్మకం కాదు మస్జీద్ అని ముస్లిం ప్రజల నమ్మకం దీంతో ఇరు పక్షాల మధ్య గొడవలు జరిగి ప్రాణ నష్టం కూడా సంభవించింది చివరికి మస్జీద్ కూల్చివేత జరిగింది 2003 లో ఆర్కీలోజికల్ సర్వే 10 శతాబ్దపు రాముని గుడి మస్జీద్ కింద ఉన్నదని రిపోర్ట్ ఇచ్చింది దీంతో ఈ సమస్య ఇంకా ముదిరింది అనేక మలుపులు తర్వాత 2019 లో సుప్రీమ్ కోర్ట్ గొడవ ఉన్న భూమి ని హిందూ పార్టీస్ కి అటాచ్ చేస్తూ గుడి కట్టుకోవాల్సిందిగా తీర్పు నిచ్చింది ముస్లిం సైడ్ వాదనలు వినిపిస్తున్న సున్ని వక్ఫ్ బోర్డు కు 5 ఎకరాల భూమిని మస్జీద్ నిర్మాణానికి అయోధ్యలో కేటాయిస్తూ తీర్పు నిచ్చింది దీంతో 2020 ఆగష్టు 5 న నరేంద్ర మోడీ భూమి పూజ చేసి రామ మందిర నిర్మాణ ప్రారంబ పనులు చేపట్టారు
మరి కుహనా మేధావులు ఈ దేశ ప్రజలకు చెప్పాలి బీజేపీ చేసిన తప్పేంటి వారిని విమర్శిస్తున్న వాళ్ళ చేసే మేలేంటి అని పురాతన చరిత్రను తీసి న్యాయాన్ని పరిరక్షించి ఇరు పక్షాలకు సయోధ్య కుదర్చి ఎటువంటి అల్లర్లకు తావీయకుండా న్యాయం చేసిన విధానం బీజేపీ సమర్ధతకు నిదర్శనం అనటం లో సందేహమే హిందూ వాదనను మోస్తున్నారు అనే వాళ్ళు కొన్ని దశాబ్దాలు పాలించిన వారు ఈ సమస్యకు శాంతియుత ముగింపు ఎందుకు ఇవ్వలేక పోయారో ఈ దేశ ప్రజలకు చెప్పాలి.
గ్యాన్ వాపసీ ఉత్తరప్రదేశ్ కేసులో కూడా ఇదే తరహా వాదనలు వస్తున్ననేపథ్యం లో ఒకసారి చూద్దాం ఔరంగజేబు నిర్మించిన ఈ మస్జీద్ పూర్వం హిందూ శివ గుడికి సంబంధించిందని దానికి అనేక ఆధారాలున్నాయని హిందూ ప్రజల నమ్మకం అటు వైపు కాదు ఇది మస్జీద్ అని వీరి వాదన మరోవైపు ఇదిలా ఉంచితే ఆర్కీలోజికల్ సర్వే గుడికి సంబందించిన ఆధారాలున్నాయి అనే వాదనకు బలం చేకూర్చే విధంగా తన రిపోర్ట్ ఉందనే వాదనలు ఉన్నాయి ఏది ఏమైనా ఇది కూడా శాంతియుత వాతావరణం లో ఇరు పార్టీలకు సమ్మతమైన పరిష్కార మార్గాన్ని బీజేపీ తీసుకు వస్తుందనేది ప్రజల నమ్మకం.
ఇతర మతాల పైన విమర్శలు చేసిన సొంత పార్టీ నుపుర్ శర్మ మరియు నవీన్ జిందాల్ సైతం బీజేపీ సస్పెండ్ చేసింది అంటే లౌకిక పద్దతిలో ఎవరు లేకున్నా వారిపై చర్యలు తప్పవని దాని అర్ధం ఇంతటి రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజాస్వామ్య విలువలను పాటిస్తున్న నరేంద్ర మోడీ నాయకత్వం లో ఉన్న బీజేపీ పార్టీ కచ్చితమైన సెక్యూలర్ అనటానికి ఇంతకంటే ఎం ఆధారాలు కావాలి కాబట్టి బీజేపీ వ్యూహాలను అర్ధం చేసుకోలేని విమర్శకులు ఇప్పటికైనా కళ్ళు తెరిస్తే మంచిది.