రాష్ట్రంలో వైసీపీ పాలన ప్రతిపక్షాలను తిట్టడం, వేదించడం మీద పెట్టిన దృష్టి కంటే వ్యవసాయం, ప్రాజెక్టుల మీద పెట్టిన దృష్టి తక్కువ అని చెప్పాలి. వైస్సార్ జిల్లా జమ్మలమడుగు-ముద్దనూరు పెన్నా అప్రోచ్ రోడ్డు మరోసారి వరదలకు కొట్టుకుపోయింది. పైన కురుస్తున్న వర్షాలకు మైలవరం జలాశయం నుంచి పెన్నా నదికి అధికారులు నీటి వదిలారు. నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో మరోసారి వంతెన కొట్టుకుపోయింది. వారం రోజుల క్రితమే తాత్కాలికంగా పెన్నా పై అప్రోచ్ రోడ్డును వేశారు. కొద్దిరోజులుగా మైలవరం నుంచి పెన్నాకు 3 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. నీటి ప్రవాహానికి రోడ్డు తెగడంతో జమ్మలమడుగు, ముద్దనూరు మధ్య రాకపోకల బందయ్యాయి.
పెన్నా చుట్టు పక్కల ఉన్న దాదాపు 16 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.ఎగువన కురుస్తున్న వర్షాలకు గండికోట జలాశయంలోకి వరద నీరు చేరుతుండడంతో అక్కడి నుండి మైలవరానికి మైలవరం జలాశయం నుంచి పెన్నా నదికి నీరు విడుదల చేస్తున్నారు మైలవరం పూర్తి సామర్థ్యం 6.5ల టిఎంసి కాగా ప్రస్తుతం మైలవరంలో 5.7 టిఎంసి ల నీరు నిల్వ ఉంది.గండికోట ప్రాజెక్టు పూర్తిసామర్థ్యం 26.85 టిఎంసిలు కాగా ప్రస్తుతం గండికోటలో 26 టిఎంసిల నీరు నిల్వ ఉంది. అధికారులు స్పందించి తగు చర్యలు చెపట్టాలని స్థానికులు కోరుతున్నారు.