కొడాలి నాని టీడీపీ మీద నేరుగా అటాక్ చేస్తూ ఉండడం తో కృష్ణా జిల్లా రాజకీయం రచ్చ రచ్చగా మారుతోంది. ఇది అధికార వైసీపీకి ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలియదు కానీ టీడీపీ మాత్రం ఫుల్ యాక్టివ్ అయింది. గతంలో వారూ వీరుగా ఉన్న వారు సైతం ఇపుడు ఒక్కటిగా కొడాలి మీదకు దాడి చేస్తున్నారు. గుడివాడలో అయితే కొడాలి కంటే ముందు ఒకసారి ఎమ్మెల్యే అయిన రావి వెంకటేశ్వర రావు ఇపుడు గేరు మార్చి జోరు చేస్తున్నారు.
కొడాలి మీడియా ముందుకొచ్చి మాట్లాడారు అంటే తాను మనసులో ఏమనుకుంటున్నానో అదే అనేస్తారు. మంత్రిగా ఉన్నప్పుడు బూతుల మంత్రిగా పేరు తెచ్చుకున్న కొడాలి నాని మంత్రి పదవి పోయిన అయిదు నెలల తరువాత మళ్లీ తన ఘాటైన మిర్చీ మాటతో మంటెక్కించారు. ఆయన ఏకంగా చంద్రబాబు లోకేష్ ల మీద గతం కంటే ఎక్కువ తీవ్రతతో కామెంట్స్ చేశారు.
టీడీపీ క్యాడర్ తట్టుకోలేనివే కొడాలి మాటలుగా ఉన్నాయి. దాంతో కృష్ణా జిల్లా టీడీపీ ఒక్కసారిగా రియాక్ట్ అయింది. దేవినేని నాని కొల్లు రవీంద్ర వర్ల రామయ్యలు అయితే కొడాలి మీద ఒక్కసారిగా మండిపోయారు. చలో గుడివాడ అంటూ బయల్దేరారు. వారిని పోలీసులు అడ్డుకుని గూడూరు పీఎస్ కి తరలించారు. క్యాడర్ తో తరలి వచ్చారు. ఇంకో వైపు చూస్తే పెడన టీడీపీ ఇన్చార్జి కాగిత కృష్ణ ప్రసాద్ మాజీ ఎమ్మెల్యేలు జయమంగళ వెంకటరమణ బోడె ప్రసాద్ ఏకంగా గుడివాడకే నేరుగ చేరుకున్నారు. అక్కడ వారికి మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వర్లు కూడా తోడు కావడంతో అంతా కలసి కొడాలి మీద గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయాలని ప్రయత్నించారు
కొడాలి నాని హఠాత్తుగా ఎందుకు ఇంతటి తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే మళ్ళీ ఆయనలో మంత్రి ఆశలు చిగురించాయా అన్న చర్చ నడుస్తోంది. అయితే కొడాలిని తప్పించింది కూడా ఆయన నోటి దూకుడు తట్టుకోవడం కష్టమనే అన్న భావనతోనే. అలాంటి టైం లో ఇపుడు ఆయన్ని కనుక మంత్రిని చేస్తే ఎన్నికల వేళకు ఒక్క కృష్ణాజిల్లా ఏమి ఖర్మ ఏపీ అంతటా టీడీపీని రీచార్జ్ చేస్తారు అన్న సెటైర్లు కూడా వినపడుతున్నాయి. ఏది ఏమైనా టీడీపీ మీద విమర్శలు చేయండి అన్న జగన్ సూచనలు ఆదేశాలు కొడాలి నానికి ఇలా అర్ధమయ్యాయి అనుకుంటున్నారు.