ద్రౌపది ముర్ము ప్రస్తుతం ఈమె పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరపున అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ప్రకటించడంతో ఈ పేరు టాక్ ఆఫ్ ది టౌన్ మారింది. ఇదిలా ఉంటే టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి మనందరికీ తెలిసిందే. వర్మ సంచలనాలకు పెట్టింది పేరు. నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు . రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది పై ఆర్జివి అభ్యంతరకరమైన పోస్టు ను పెట్టాడు. ద్రౌపదీ ముర్ము ప్రెసిడెంట్ ఐతే పాండవులు ఎవరు..? మరీ ముఖ్యంగా కౌరవులు ఎవరు ? అంటూ తన ట్విట్టర్ ఖాతాలో కాంట్రవర్సీ కామెంట్ ని పోస్ట్ చేశారు. ఇదే విషయం గిరిజనులు స్పందిస్తూ రామ్ గోపాల్ వర్మ పై ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసు పెట్టాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ట్వీట్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దర్శకుడు వర్మ ఇపుడు సినిమాలకన్నా వివాదాల ద్వారానే మీడియాలో కనిపిస్తున్నారు. తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు వర్మ. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినీ దర్శకులు రాంగోపాల్ వర్మపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆదివాసీ మహిళ రాష్ట్రపతి అవుతున్న సందర్భంలో దర్శకుడు రామ్ గోపాల వర్మ చేసిన ట్వీట్ పై పోలీసు శాఖ వెంటనే చర్యలు చేపట్టాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు డిమాండ్ చేశారు. సుమోటొ గా కేసు నమోదు చేయాలి రాష్ట్రపతి అభ్యర్ధి నామవాచకాన్ని సెటైరికల్ గా వాడటం అంటే రామ్ గోపాల్ వర్మ తన పరిధికి మించి వ్యవహరించారు అన్నారు. వర్మ అడుగుజాడల్లో ఎవరూ వెళ్ళకుండా ఉండాలంటే వర్మని జైలుకి పంపాలని అదే సందర్భంలో పేరొందిన మానసిక వైద్యుడికి చూపించాల్సిన అవసరం ఉందని సలహా ఇచ్చారు…. వాక్ స్వాతంత్ర్య హద్దును కూడా దాటి ప్రవర్తించిన రామ్ గోపాల్ వర్మ పై చర్యలు తీసుకోవాలని ఎపి బిజెపి ఛీఫ్ సోమువీర్రాజు డిమాండ్ చేశారు. అదే విధంగా తెలంగాణలో మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్, సీనియర్ బీజేపీ రాష్ట్ర నాయకులు గూడూరు నారాయణ రెడ్డి లు హైదరాబాద్ అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఏన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థినిగా ద్రౌపది ముర్మును ప్రకటించిన సందర్భంగా ‘ద్రౌపది రాష్ట్రపతి ‘ అయితే పాండవులు ఎవరు ? మరి ముఖ్యంగా కౌరవులు ఎవరంటూ కామెంట్ చేశారని, ఇవి ఆమె మనోభావాలు దెబ్బతినేలా ఉన్నందున ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని వారు తమ ఫిర్యాదులో కోరారు. రాంగోపాల్ వర్మపై బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారని. అయితే లీగల్ ఒపీనియన్ తీసుకున్న అనంతరం కేసు నమోదు చేస్తామని అబిడ్స్ ఇన్ స్పెక్టర్ ప్రసాదరావు తెలిపారు.
రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా వివాదమే. సమకాలీన అంశాల ఆధారంగా సినిమాలు తీస్తూ క్యాష్ చేసుకుంటారు. నేరాలు, ఘోరాలు, శృంగారం, రాజకీయాలు.. ఇటీవల వీటిపైనే ఎక్కువ మూవీలు తీస్తుంటారు ఆర్జీవీ. కేవలం సినిమాలే కాదు.. అప్పుడప్పుడు సామాజిక అంశాలు, రాజకీయాలపైనా తన దైన శైలిలో స్పందిస్తుంటారు ఆర్జీవీ. ఇటీవల కూడా ఆయన ఓ ట్వీట్ చేశారు. రామ్ గోపాల్ వర్మ చేసిన ఆ ట్వీట్ తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అది ఓ మంత్రిని టార్గెట్ చేస్తూ.. వార్నింగ్ ఇచ్చినట్లుగా ఉంది.
ప్రస్తుతం కొండా మురళి, కొండా సురేఖ ప్రేమాయణంతో పాటు రాజకీయ జీవితంపై బయోపిక్ చేస్తున్నారు రామ్ గోపాల్ వర్మ. ఈ సినిమాకు “కొండా” అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. ఇటీవలే కొండా సినిమా షూటింగ్ కోసం చిత్ర బృందం వరంగల్‌లో పర్యటించింది. ఐతే ఈ సినిమాకు సంబంధించి రామ్ గోపాల్ వర్మ సంచలన ట్వీట్ చేశారు.
“అరచేతిని అడ్డుపెట్టి సూర్య కాంతిని ఆపలేరని ఆనాటి కార్ల్ మార్క్స్ తెలుసుకున్నట్టే, పిచ్చిపిచ్చి ప్రయత్నాలతో కొండా సినిమా షూటింగ్ ఆపలేరని నల్ల బల్లి సుధాకర్ తెలుసుకోవాలి…జై తెలంగాణ” అంటూ వివాదాస్పద ట్వీట్ చేశారు వర్మ. ఆర్జీవీ చేసిన ఆ ట్వీట్‌లో నల్లబల్లి సుధాకర్… ఎవరు అనే దానిపై హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది.
ఐతే ఆయన తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకే వార్నింగ్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కొండా సినిమాను నిలిపివేయాల్సిందిగా.. ఎర్రబెల్లి దయాకర్ రావు నుంచి రామ్ గోపాల్ వర్మకు బెదిరింపులు వచ్చాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే రామ్ గోపాల్ వర్మ నల్లబల్లి సుధాకర్ అంటూ వార్నింగ్ ఇచ్చినట్లుగా నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ద్రౌపది ముర్ము పై వర్మ ట్వీట్ విమర్శల పాలయ్యేసరికి ఆయన ఈరోజు రీట్వీట్ చేసి క్లారిటీ ఇచ్చారు. ఎవరిని ఉద్దేశించి కామెంట్ చేయలేదన్నారు. మహాభారతంలో తన చాల ఇష్టమైనది ద్రౌపది పాత్ర అని అన్నారు. ఆ పేరు చాలా అరుదు కాబట్టి మహాభారతంలో పాత్రలు గుర్తొచ్చి అలా అన్నానని చెప్పారు. అంతేకాని ఎవరి మనోభావాలు దెబ్బ తీయాలనే ఉద్దేశంతో కాదని వివరణ ఇచ్చారు ఆర్జీవీ.