పార్లమెంటులో ఉపయోగించ కూడని పదాలు (అన్ పార్లమెంటరీ వర్డ్స్) ఏంటో చెబుతూ నోటిఫికేషన్ జారీ చేసిన లోక్ సభ సెక్రటేరియట్ తాజాగా మరిన్నింటిపై ఆంక్షలకు దిగింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో సభ్యులు ఎవరూ కూడా పాంప్లేట్లు (కరపత్రాలు), ప్లకార్డులను లోక్ సభలో ప్రదర్శించకూడదని మార్గదర్శకాల్లో ఉంది. పార్లమెంటులో ధర్మాలు, నిరసన ప్రదర్శనలకు అనుమతి ఇవ్వకపోవడం తెలిసిందే. దీన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష పార్టీల నేతలు పార్లమెంటు ఆవరణలో నినాదాలు చేస్తుండడం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో తాజా ఆదేశాలు వెలువడ్డాయి. ఎటువంటి సాహిత్యం కానీ, ప్రశ్నలు, కరపత్రాలు, ప్రెస్ నోట్లు, ఇతర రూపాల్లోని సమాచారాన్ని కానీ స్పీకర్ ముందస్తు అనుమతి లేకుండా ప్రదర్శించడాన్ని లోక్‌సభ సెక్రటేరియట్ నిషేధించారు.. పార్లమెంటు సంప్రదాయం ప్రకారం, సభ ఆవరణలో గౌరవ స్పీకర్ ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి సాహిత్యం, ప్రశ్నాపత్రం, కరపత్రాలు, ప్రెస్ నోట్లు, కరపత్రాలు లేదా ముద్రించిన లేదా మరేదైనా పంపిణీ చేయరాదు. పార్లమెంటు హౌస్ కాంప్లెక్స్ లోపల ప్లకార్డులు కూడా ఖచ్చితంగా నిషేధించబడ్డాయి, ”అని ఆర్డర్‌లో పేర్కొంది. పార్లమెంటు హౌస్ ఆవరణలో ఎటువంటి “ప్రదర్శన, ధర్నా, సమ్మె, ఉపవాసం లేదా ఏదైనా మతపరమైన వేడుకలను నిర్వహించడం పై ఇప్పటికే నిషేధం అమల్లో ఉంది… ఈ నేపథ్ంలో విపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి… అందులో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభలో పార్టీ చీఫ్ విప్ జైరాం రమేష్ ట్విటర్‌లో మొదటిసారిగా విమర్శించిన వారిలో ఉన్నారు.
అదే విధంగా ఈ నిర్ణయంపై కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా-మార్క్సిస్ట్ (సీపీఐ-ఎం) నేత సీతారాం ఏచూరి కూడా స్పందించారు. “ఏం ప్రహసనం. భారతదేశం యొక్క ఆత్మను, దాని ప్రజాస్వామ్యాన్ని మరియు దాని స్వరాన్ని మూటగట్టుకునే ప్రయత్నాలు పడిపోతాయి” అని ఆయన ట్వీట్ చేశారు.
గత కొన్ని పార్లమెంట్ సమావేశాలు, ప్రత్యేకించి రాజ్యసభలో, ప్రతిపక్ష పార్టీల నుండి పెద్ద కోలాహలం కనిపించింది, వారు ప్లకార్డులు మరియు కరపత్రాలను చించి, కుర్చీపైకి విసిరారు లేదా ప్లకార్డులతో సభ నుండి వాకౌట్ చేసి ధర్నాకు దిగారు, పార్లమెంటు చర్చలకు అంతరాయం కలిగించారు.