పవన కళ్యాణ్ చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్ర కు రాష్ట్రవ్యాప్తంగానే కాదు, దేశ వ్యాప్తంగా గుర్తింపు లభిస్తుంది. నేషనల్ మీడియా కూడా పవన్ చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్రను కవర్ చేసింది. రాష్ట్రంలో అప్పులు బాధలు తట్టుకోలేక కన్నుమూసిన కౌలు రైతులు ఆడుకోవడానికి పవన్ కళ్యాణ్ ఈ యాత్ర చేపట్టారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైరల్ ఫీవర్ కారణంగా గత మూడు వారాలుగా రాజకీయ యాత్రలకు విరామం ఇచ్చారు. తూ.గో జిల్లాలో జనవాణి, కౌలు రైతు భరోసా యాత్ర చేసిన తర్వాత ఆయనకు వైరల్ ఫీవర్ వచ్చింది.ఇప్పుడు ఫీవర్ తగ్గిపోవడంతో ఆయన రాయలసీమలో మరోసారి కౌలు రైతు భరోసా యాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు.
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించి, తలా రూ. లక్ష ఆర్థిక సాయం చేస్తారు.వైయస్ఆర్ జిల్లా సిద్దవటంలో శనివారం నిర్వహించనున్న కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా జనసేన రచ్చబండ కార్యక్రమ ఏర్పాటు చేసింది. సీఎం జగన్ సొంత జిల్లా కడప జిల్లా వ్యాప్తంగా 167 మంది కౌలు రైతులు బలవన్మరణాలకు పాల్పడితే సీఎం జగన్ ఎంతమందికి నష్ట పరిహారంగా రూ.7 లక్షలు ఇచ్చారని జనసేన ప్రశ్నిస్తుంది. దస్త్రాలు లేవని చాలా మందిని సంవత్సరాల తరబడి తిప్పుకుంటూ నిర్లక్ష్యం చేశారని, కొందరికి మాత్రమే రూ.లక్ష ఇచ్చి చేతులు దులుపుకున్నారని జనసేన విమర్శిస్తుంది.
ఈ విషయాన్ని ఇండియా అహీడ్ న్యూస్ లో కవర్ చేసింది. ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని పంచుకున్నారు. ఇంకా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3000 మంది కంటే ఎక్కువ మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, ఈ విషయాన్ని గుర్తించి తమ ఛానల్ లో చర్చ చేసినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు.