ఆంధ్రప్రదేశ్ రాజకీయం లో ఇప్పుడు హాట్ టాపిక్ అధికార వైసీపీ మరియు జనసేన సోషల్ మీడియా వార్ అని చెప్పుకోవాలి. రెండు పార్టీలకు చెందిన ప్రముఖ నాయకులు ఒకరి మీద ఒకరు మాటల దాడులు ప్రత్యక్షంగా కాకుండా సోషల్ మీడియా వేదికగా కొనసాగిస్తున్నారు. ఒక్కోసారి ఇవి పరిధులు దాటుతున్నాయి అని చెప్పక తప్పదు. వ్యంగంగా ఇరు పార్టీలకు చెందిన ముఖ్యులు ఇలా దుమ్మెత్తి పోసుకోడం,సవాళ్లు ప్రతసవాళ్లు విసురుకోడం రోజు పరిపాటి అయిపోయింది.
అధికార వైసీపీ మంత్రి అంబటి రాంబాబు మరియు జనసేన అధినేత అన్నయ్య నాగబాబు ల మధ్య ట్వీట్స్ వార్ చర్చను రేకెత్తించడమే కాకుండా ఆసక్తిని కూడా కలిగిస్తుంది. ఒకపక్క నీటిపారుదశాఖ మంత్రి అంబటి రాంబాబు జనసేనాని నీ దత్త పుత్రుడు, పచ్చ పొత్తిళ్ళలో నిద్రిస్తున్న పవన్ అంటూ ట్వీట్లు చేస్తుంటే, మరో పక్క మెగా బ్రదర్ నాగబాబు నేనేమీ తక్కువ తినలేదు అంటూ అంబటి రాంబాబు గారి కార్టూన్ పెట్టీ జంబో సర్కస్ పార్టీ, బఫూన్ గాళ్ళు అంటూ సమాధానం ఇస్తూ వస్తున్నారు.
తాజాగా నాగబాబు సోషల్ మీడియా వేదికగా ఒక సవాలును వైసీపీ పార్టీ అధినేతకు డైరెక్ట్ గా విసిరారు.
” వైసీపీ పార్టీ కి గానీ, అధినేత జగన్ కి గానీ 5 యేళ్లు పూర్తిగా పాలించే దమ్ముందా? ముందుస్తుకు వెళ్లకుండా పూర్తి కాలం పాలించగలరా?” అంటూ సవాలు విసిరారు.అలాగే ” ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత పరిస్థితుల మీద, జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద ఓపెన్ డిబేట్ కి వచ్చే దమ్ముందా?” అంటూ ఛాలెంజ్ విసిరారు. ద్వితీయ శ్రేణి వైసీపీ నాయకులు కాకుండా కేవలం అధినాయకుల స్థాయిలో డిబేట్ పెడదాం ఎవరి సత్తా ఏంటో చూద్దాం అని నాగబాబు సవాలు చేశారు.మేధావులు, టీవీ ఛానెల్స్ , ప్రజల సమక్షంలో ఈ డిబేట్ పెడదాం, దాని వల్ల ప్రజలకు ఎవరి సత్తా ఏంటో తెలిపోతుంది అని అన్నారు. అలా డిబేట్ కి రాని పక్షంలో ఇక మీదట జనసేన మీద, పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత విమర్శలు మానాలని హితవు పలికారు. సోషల్ మీడియా వేదికగా వీళ్ళ వార్ తీవ్ర చర్చకు దారితీస్తుంది. చూద్దాం వీళ్ళ సవాళ్లు, ప్రతిసవాళ్లు ఎంత దూరం వెళతాయో?…