గెలవాలి.. ఈసారి ఎలాగైనా గెలవాలి. ఆ నాయకుడు మనకు ఎంత క్లోజ్ అయినా సరే.. ఓడిపోతాడనే అనుమానం ఉంటే చాలు… పక్కన పెట్టేద్దాం. గెలుస్తాడని అనిపిస్తే చాలు ప్రత్యర్ధి అయినా సరే టిక్కెట్ ఇఛ్చి పోటీ చేయిద్దాం. ఇప్పుడు ఇదే ఫార్ములాతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుపు వ్యూహం రచిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. రాష్ట్రమంతా నియోజకవర్గాల వారీగా అభ్యర్ధుల కసరత్తు ఇప్పటికే పూర్తి చేసినట్లు టాక్. గెలుపు గుర్రాలను అయితే ముందే ఫిక్స్ చేశారంట. కాని ఎక్కడైతే వైసీపీకి అవకాశాలు తగ్గాయని అనుకుంటున్నారో,ఆ నియోజకవర్గాలు మాత్రం పెండింగ్ పెట్టినట్లు తెలుస్తోంది.అలాంటి నియోజకవర్గాల్లో ఎవరిని పెడితే గెలుస్తామో చూడాలని జగన్ సర్వే చేయిస్తున్నారంట. మామూలుగా అయితే పాత రోజుల్లో ఓ మేధావినో, కాస్త పేరున్న డాక్టరునో, లాయరునో తీసుకొచ్చేవాళ్లు. ఎందుకంటే రాజకీయ నేతలకు మంచి పేరు లేనప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేసేవాళ్లు. కాని జగన్మోహన్ రెడ్డికి అలాంటివాటిపై నమ్మకం లేదు. గెలవాలంటే గట్టి క్యాండేట్ అయి ఉండాలి.. డబ్బులు దండిగా ఖర్చు పెట్టగలిగి ఉండాలి. అలాంటివారు అయితే ఈ రోజుల్లో గెలవగలరనేది ఆయన కాన్సెప్ట్. అందుకే మనోడు కాకపోతే ఏంటి.. ప్రత్యర్ధి పార్టీ అయినా పర్వాలేదు మాట్లాడండి అంటున్నారంట.
కర్నూలు జిల్లా బనగానపల్లి నియోజకవర్గంలో బీసీ జనార్దన్ రెడ్డి టీడీపీ నేత. 2019లో ఓడిపోయినా… ఆయనే బలమైన నేత అంటున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆయనే గెలుస్తారంట. అందుకే ఆయనతోనే మాట్లాడమని జగన్ చెప్పారంట. జనార్ధన్ రెడ్డిని ఒప్పించి వైసీపీ తరపున పోటీ చేయిస్తే.. బనగానపల్లిని వైసీపీ ఖాతాలో వేసుకోవచ్చనేదే ప్లాన్ గా చెబుతున్నారు. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే.ఇలా రాష్ట్రమంతా జల్లెడ పడుతున్నారు. ఎక్కడైనా సరే గెలిచేవాడు మాత్రమే కావాలి. ఆ గెలిచేవాడు ఏ పార్టీ అయినా పర్వాలేదు.. మన పార్టీ టిక్కెట్ మీద పోటీ చేయిద్దాం.. ఇదే ఇఫ్పుడు జగన్ తమ పార్టీ నేతలకు అందిస్తున్న సందేశం. దీంతో ఎంతమంది టిక్కెట్లు పోతున్నాయో అనే టెన్షన్ ఒకవైపు.. తన ప్రత్యర్ధే తన స్థానంలో వస్తాడనే ఆలోచనకే కోపం మరో వైపు. ఇలా వైసీపీ నేతలందరిలోనూ అదో రకమైన ఫీలింగ్ వచ్చేస్తుందంట.తన వల్లే గెలిచాం.. తన వల్లే మళ్లీ గెలుస్తామని చెబుతున్న జగన్మోహన్ రెడ్డి.. మమ్మల్ని ఎందుకు మార్చడం? అని వైసీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. ఆయన పాలన బాగుంటే మేం కూడా గెలుస్తాం కదా.. మేం గెలవడం లేదు అంటే.. ఆయనకు కూడా నెగటివ్ వచ్చినట్లే కదా అని వాదిస్తున్నారంట. ఏమైనా మరోసారి గెలవడానికి జగన్ చేస్తున్న కసరత్తు మాత్రం అంతా ఇంతా కాదు.