వైసీపీ ఎమ్మెల్యేలు టెన్షన్ లో పడ్డారు. వాళ్లంతా ఐఎఎస్, ఐపీఎస్ కంటే పెద్ద ఇంటర్వ్యూలకు వెళ్లబోతున్నారు. 2019లోనే ఎగ్జామ్ పాస్ అయ్యారు. కాని మళ్లీ ఇంకో ఎగ్జామ్ రాయాలి. అసలు ఆ ఎగ్జామ్ కి క్వాలిఫికేషన్ ఉందో లేదో.. ఈ ఇంటర్వ్యూలో తేలుస్తారు. జనరల్ గా ఎగ్జామ్ అయ్యాక ఇంటర్వ్యూ ఉంటుంది.. ఇక్కడ అలా కాదు. ఎగ్జామ్ రాయాలంటే ముందు ఇంటర్వ్యూ పాస్ అవ్వాలి. అందరూ ప్రిపేరవుతున్నారు. ఏం అడుగుతారు? ఏం చెప్పాలి? ఎలా తప్పించుకోవాలి? ఎలా పాస్ అయిపోవాలి? ఇదే వారి మైండ్ లో తిరుగుతూ ఉంది. కాని టెన్షన్ మాత్రం తగ్గటం లేదు. ఎందుకంటే ఇంటర్వ్యూ చేసేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి.
అవును సీఎం సాబ్ ప్రతి వైసీపీ ఎమ్మెల్యేతో వన్ టు వన్ మాట్లాడతారంట. దీనికి అంతా సిద్ధం చేయమని ఇప్పటికే ఆర్డర్స్ పాస్ చేసేశారని తెలుస్తోంది. ముందు 25 మందితో అన్నారు.. కాని ఇప్పుడు అందరితోనూ ఉంటుంది. ముందు 25 మందితో మొదలవుతుంది. ఓడిపోతారనుకునేవారు.. ఓటమి అంచుల్లో ఉన్నవారు.. ఫిప్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నవాళ్లు.. వీరికే మొదటి అపాయింట్ మెంట్. వీరందరితోనూ జగన్ నేరుగా డిస్కస్ చేసి.. నియోజకవర్గం గెలవాలంటే ఏం చేయాలి.. వాళ్లు ఇప్పటివరకు ఎలాంటి తప్పులు చేశారు.. ఎలా సరి చేసుకోవాలి.. ఇవన్నీ డీటెయిల్డ్ గా మాట్లాడబోతున్నారు.మొదటి మూడేళ్లు ప్రతిపక్షాల సంగతి చూడటం, సంక్షేమ పథకాల అమలులో బిజీగా ఉన్న జగన్, ఈ రెండేళ్లు పూర్తిగా ఎన్నికల బిజీలోనే ఉండబోతున్నారు. మామూలుగా అయితే ముఖ్యమంత్రులు పరిపాలనలోనూ, అభివృద్ధి కార్యక్రమాల సమీక్షల్లోనూ బిజీగా ఉంటారు. పార్టీకి టైమ్ కేటాయించడం కష్టమే. కాని జగన్ మాత్రం గత కొన్ని రోజులుగా కేవలం పార్టీకే ఎక్కువ టైమ్ కేటాయిస్తూ ఫుల్ రేంజ్ లో కసరత్తు చేస్తున్నారు. మరోసారి గెలుపే లక్ష్యంగా తన ప్రోగ్రామ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు.పార్టీ నేతలు, ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహించిన జగన్, ఈ మధ్యే కార్యకర్తల సమావేశాల్లోనూ పాల్గొంటున్నారు. ఇప్పుడు లేటెస్టుగా ఎమ్మెల్యేతో వన్ టు వన్ మీటింగ్ పెట్టుకుంటున్నారు. ఈ మీటింగులు అయిపోయేటప్పటికీ.. ఎవరికి టిక్కెట్ వస్తుంది… ఎవరికి రాదు అనేది కూడా తేలిపోతుందని అనుకుంటున్నారు. పైగా అది అయిపోయాక.. నాకు టిక్కెట్ ఇవ్వండి అని అడగటానికి గాని.. వస్తుందని ఆశిస్తున్నాను.. ఇవ్వకపోతే ఆలోచిస్తాను ఇలాంటివేమీ మాట్లాడే ఛాన్సే ఉండదు. అందుకే అందరూ టెన్షన్ లో ఉన్నారు. ఇక మళ్లీ ఎమ్మెల్యే కాలేను అనేది తెలిసిపోయాక.. మిగతా రెండేళ్లు ఎమ్మెల్యేగా ఎలా చేస్తాం.. నీరసం వచ్చేస్తుంది కదా అని కొందరు డౌట్ లో పడుతున్నారు. అందుకే జగన్ ని ఈ సమావేశాల్లో టిక్కెట్ ఇవ్వను అనేది రివీల్ కాకుండా చూడాలని.. ఆయన సన్నిహితులు సూచిస్తున్నారంట. ఎవరెంత సూచించినా.. జగనన్న అనుకున్నదే చేస్తాడు కాబట్టి.. ఏం చేస్తారనేది వేచి చూడాల్సిందే.