సెప్టెంబర్ నెల ప్రారంభంలో ఏపీ మంత్రివర్గ సమావేశంలో సీఎం జగన్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ చేస్తున్న ఆరోపణలకు మంత్రులు సరిగ్గా కౌంటర్ ఇవ్వడం లేదు, మనం ఇన్ని మంచి పనులు చేస్తున్న టీడీపీ ఆరోపణలను తిప్పి కొట్టలేక పోతున్నాం. ఇది ఇలాగే కొనసాగితే మంత్రులను కొందరిని తప్పించి వేరే వారిని తీసుకుంటాను అని వ్యాఖ్యానించారు. అంతే అప్పటి నుండి సెప్టెంబర్ నెల ఆఖర్లో మంత్రివర్గ విస్తరణ ఉండబోతుంది, ముగ్గురు మంత్రులను మారుస్తారు అని ఒక వార్త చక్కర్లు కొడుతుంది.
ఆ వార్త బయటకు వచ్చిన దగ్గర నుండి మాజీ మంత్రి కొడాలి నాని దూకుడు పెంచారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడుతున్నారు. ఇటీవల ప్రెస్‌మీట్‌లో నాని చేసిన వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు తీవ్ర నిరసనలు చేశాయి. చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తున్నారు. కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా రోడ్డెక్కారు. కొడాలి నానిపై ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ఇంకా కొనసాగుతున్నాయి,మాజీ మంత్రిపై పోలీస్ స్టేషన్‌లలో ఫిర్యాదులు చేశారు.
ఈ సమయంలో ఒక ఆసక్తికరమైన వార్త ఒకటి వైసీపీ వర్గాల్లో చక్కర కొడుతుంది.మాజీ మంత్రి కొడాలి నానికి మరోసారి కేబినెట్‌లో చోటు దక్కబోతోందని ప్రచారం చేస్తున్నారు. కొంతమంది వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. కొడాలి నానిని మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారని చెబుతున్నారు.కొందరు ఇంకో అడుగు ముందుకు వేసి కొడాలికి ఏకంగా హోంమంత్రి పదవి ఇస్తారంటూ ప్రచారం చేస్తున్నారు. అదే కనుక జరిగితే చంద్రబాబు ను ఆయన కుటుంబ సభ్యులను పరిధి దాటి అసహ్యంగా తిట్టిన వారికి మంత్రి పదవులు గ్యారంటీ అనుకొని మిగతా ఎమ్మెల్యేలు కూడా నోటికి పని చెప్పడం ఖాయం.