చంద్రబాబు కుప్పం పర్యటనపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతు..”30 సంవత్సరాల్లో కుప్పంలో చంద్రబాబు చేసిన అభివృద్థిని శూన్యం అన్నారు. కుప్పంలో పెండింగ్ లో ఉన్న తాగు – సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. చంద్రబాబు ఎమ్మెల్యేగా కుప్పం నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన విషయం చంద్రబాబుకు తెలియదా?మూడేళ్ళలో కుప్పంకు కేవలం 6 సార్లు మాత్రమే చంద్రబాబు వచ్చారని” అని అన్నారు.
చంద్రబాబు ఎమ్మెల్యేగా కుప్పంలో ఒక్కరికైనా ఇల్లు కట్టించి ఇచ్చారా? చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పంలో వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే 7 వేల ఇళ్లను నిర్మించి ఇచ్చిందని, త్వరలో మరో 3 వేల ఇళ్ళ నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు. నారా లోకేష్ మంగళగిరిలోనే ఘోరంగా ఓడిపోయారు. కుమారుడు లోకేష్‌ను గెలిపించుకోలేని వ్యక్తి చంద్రబాబు.. తన హోదాను తానే దిగజార్చుకుంటున్నారని చెప్పారు. బ్యానర్లు చించి, రాళ్ళతో వైసీపీ కార్యకర్తలను కొట్టారు. ఇకనైనా ప్రభుత్వ పనులను అడ్డుకోవడం మానివేయాలని, కుప్పంలోనూ ఉన్న పేరు పోతుందంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు.
చంద్రబాబు కుప్పం పర్యటనలో వైసీపీ కార్యకర్తలపై దాడి చేసింది టీడీపీ నేతలేనని ఆరోపించారు.మూడు రోజుల చంద్రబాబు పర్యటనలో అధికంగా గాయపడింది వైసీపీ కార్యకర్తలేనని, బయటి వ్యక్తులను తీసుకొచ్చి మా పార్టీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడి చేయించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.టీడీపీ అధినేత సొంత నియోజకవర్గం కుప్పం ప్రజలు చంద్రబాబును నమ్మడం లేదనీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు.