ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివిధ సలహాల మీద సమీక్ష నిర్వహించి, పలు సూచనలు చేశారు. ముఖ్యంగా రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూరుస్తున్న శాఖలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు.రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్, ఎక్సైజ్‌శాఖ,భూగర్భ గనులు,విద్యుత్, అటవీ పర్యావరణ,రవాణాశాఖల మంత్రులతో పాటు సీఎస్, డీజీపీ ఈ సమీక్షలో పాల్గొన్నారు. రాష్ట్రంలో మద్యం వినియోగం బాగా తగ్గిందని,ఆదాయం మాత్రం పెరిగిందని అధికారులు సీఎంకు తెలిపారు. 2018–19 లో 384లక్షల కేసుల మద్యం అమ్మగా 2021–22లో అది 278 లక్షల కేసులకు తగ్గిందని తెలిపారు. 2018–19లో మద్యం విక్రయాలపై 20,128 కోట్లు ఆదాయం రాగా.. 2021–22లో ఆదాయం 25,023 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. రేట్లు బాగా పెంచడం వల్ల మద్యం వినియోగం గణనీయంగా తగ్గిందని సీఎం జగన్ అన్నారు.
గంజాయి సాగును నివారించేందుకు అన్ని కట్టుదిట్టమైన ప్రణాళికలతో ముందకు సాగాలని సీఎం ఆదేశించారు. జీవనోపాధి కోసం ప్రత్యామ్నాయాలను చూపాలని అన్నారు. మంచి పంటలను సాగుచేయడానికి అవసరమైన విత్తనాలు, ఇతర సహాయ సహకారాలు వారికి అందించాలన్నారు. గంజాయి సాగుని వదిలేసి వివిధ పంటలు సాగుచేస్తున్న వారికి ROFR పట్టాలు ఇచ్చి, వారికి రైతు భరోసా వర్తింప చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.
నాటు సారా తయారీ ఎక్కువగా ఉన్న గ్రామాలపై ప్రత్యేక దృష్టిపెట్టినట్లు అధికారులు తెలిపారు. నాటుసారా తయారీలో ఉన్న వారిని దాని నుంచి బయట పడేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఆయా కుటుంబాలకు స్వయంఉపాధి పెంచి, వారికి గౌరవ ప్రదమైన ఆదాయాలు వచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మాదక ద్రవ్యాలు, గంజాయి లాంటి వాటికి విద్యార్థులు, యువతలోను కాకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి కాలేజీ, యూనివర్శిటీ ముందు SEB 14400 నెంబర్ ను ప్రదర్శించాలని సీఎం ఆదేశించారు.