CPS ను రద్దు చేసే ప్రశ్నే లేదని అయితే CPS కన్నా మరింత మంచి చేస్తామని ఉద్యోగులకు ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. CPS, GPS అంశంపై క్యాబినెట్ సబ్ కమిటీ మరోసారి సమావేశం అయింది. ఉద్యోగ సంఘాల నేతలు కూడా హాజరయ్యారు. అయితే సమావేశంలోనూ అటు ఉద్యోగ సంఘాల నేతలు, ఇటు ప్రభుత్వ కమిటీ ఎవరి వాదనకే వారు కట్టుబడ్డారు. సమావేశం ముగిసిన తరవాత మీడియాతో మాట్లాడిన బొత్స సత్యనారాణ సీపీఎస్ రద్దు చేసేది లేదని ఇప్పటికి చాలా సార్లు చెప్పామన్నారు. గత GPS కన్నా మెరుగైన GPS ను తెస్తున్నామని ఫ్యామిలీ పెన్షన్ ఇచ్చే ప్రతిపాదన కూడా చేశామన్నారు. పెన్షన్ 10 వేలు కనిష్టంగా పెన్షన్ మొదలు అవుతుందన్నారు. ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చే విధంగా పెన్షన్ ప్రారంభమవుతుందన్నారు. మాకున్న పరిస్థితి బట్టి ఉద్యోగ సంఘాలతో మాట్లాడామని స్పష్టం చేశారు.
అయిదు సవరణల తో జీపీఎస్ 2.0 ను తెర మీదకు తెచ్చారని AP JAC అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తెలిపారు. దానికి కూడా అంగీకరించేది లేదని చెప్పామమన్నారు. GPS తో 33 శాతం లోనే ఉద్యోగి సరిపెట్టుకోవాల్సి వుందని ఏపీ జేఏసీ , ఏపీ NGO సంఘాలు OPS నే కోరుకుంటున్నాయని బండి శ్రీనివాసరావు తెలిపారు. CPS రద్దు చేస్తామని ఎన్నికల్లో సీఎం జగన్ హామీ ఇచ్చారు. అయితే అప్పట్లో అవగాహన లేక హామీ ఇచ్చారని సీపీఎస్ రద్దు చేయడం సాద్యం కాదని జగన్ చెబుతున్నారు. దీంతో సీపీఎస్ రద్దు చేయకపోయినా అంతకు మించిన మేలు చేస్తామని GPS ప్రతిపాదన తెచ్చారు. ఈ విషయంలో ప్రభుత్వం, ఉద్యోగులు తగ్గేది లేదు అంటున్నారు. దీనికి ఎలాంటి ముగింపు వస్తుందో చూడాలి.