రాజకీయాలు అంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం, పార్టీ నిర్వహణకు అధిక మొత్తంలో డబ్బు కావాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీల్లో ఒకటిగా ఉన్న మరియు ప్రధాన పార్టీ అయిన జనసేన పార్టీ నిధుల సేకరణ కోసం ప్రయత్నాలు చేస్తుంది.జనసేన పార్టీకి పటిష్టమైన ఆర్థిక వనరులు గొప్పగా లేవు.వారికి ఉన్న బలం మొత్తం జనసైనికులే. ఆ జనసైనికుల సాయంతోనే పార్టీకి ఆర్థిక ఇబ్బందులు కలగకుండా చూడాలని పార్టీ కీలక నేతలు భావిస్తున్నారు. జనసేనకు విరాళాల సేకరణకు ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించారు నాగబాబు. “నా సేన కోసం నా వంతు” అంటూ జనసేన విరాళాల సేకరణ ప్రారంభించారు.
జనసేనకు విరాళాలివ్వాలనుకునేవారి ఓ విండో అందుబాటులో ఉంది. దాని ద్వారా నెలవారీ సాయం చేస్తున్న కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. అయితే ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో పార్టీ పరమైన ఖర్చులు పెరిగిపోయాయి. వాటిని తట్టుకోవాలంటే విరాళాల సేకరణలో స్పీడ్ పెంచాలని నిర్ణయించుకున్నారు. రైతు భరోసా యాత్రకు సొంత డబ్బులే పవన్ ఇస్తున్నారు. కొంత మంది పార్టీ నేతలు విరాళం ఇచ్చినా అది చాలా స్వల్పమే. ఇప్పుడు జనసైనికులు ఎంత మేర అండగా నిలిస్తే,జనసేనకు అంత ఆర్థిక పరిపుష్టి ఉంటుంది. అందుకే “నా సేన కోసం నా సేవ” అనే స్కీమ్ ప్రారంభించారు.
“నా సేన కోసం నా వంతు కార్యక్రమం’’ నిర్వహణ కోసం 32 మందితో కూడిన కమిటీని నాగబాబు ప్రకటించారు. కమిటీ చైర్మన్ గా బొంగునూరి మహేందర్ రెడ్డి, కన్వీనర్ గా తాళ్లూరి రామ్, కో కన్వీనర్లుగా రుక్మిణీ కోట, టి.సి.వరుణ్, కో ఆర్డినేషన్ కమిటీలో తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఐ.టీ. విభాగం నుంచి పసుపులేటి సంజీవ్, ఎన్.అర్.ఐ. భాస్కర్, సాయి రాజ్ కె., సతీశ్ రెడ్డి, క్రాంతి కిరణ్, పవన్ కిషోర్, గిరిధర్, రవి కుమార్, ఏరియా కో ఆర్డినేటర్లుగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ముఖ్యమైన సభ్యులు ఉంటారు. జనసైనికులను నమ్ముకున్న జనసేన ను ఎంత మాత్రం ఆదుకుని ముందుకు తీసుకొని పోతారో చూడాలి, లేదా ఎప్పటిలానే పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బులు పెట్టాలి అంటే ముందు ముందు కష్టం అవ్వొచ్చు.