అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి రోజా మాట్లాడుతూ టీడీపీ నేతలు పిచ్చి పట్టినట్లు శాసనసభలో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ నేతలకు దేనిమీద పోరాడాలో కూడా తెలియడం లేదని ఎగతాళి చేశారు. ప్రజాసాధికారత సర్వే ద్వారా డేటా సేకరించి దుష్ట పన్నాగం పన్నారని ఆరోపించారు. ఈ డేటా డేరా బాబా కంటే పెద్ద దొంగ అని విమర్శించారు. 30 లక్షల మంది డేటాను చోరీ చేశారన్నారు. డేటా చౌర్యంపై సమగ్ర విచారణ జరపాలని కోరుతున్నానన్నారు. గత ప్రభుత్వంలో ప్రతిపక్షనేతల ఫోన్లను ట్యాప్ చేయించారని ఆరోపించారు. 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలో లాక్కున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేశ్ కు బాడీతో పాటు మైండ్ లో గుజ్జు కూడా కరిగిపోయిందని విమర్శించారు.
నిజంగా NTR మీద చంద్రబాబుకు ప్రేమ ఉంటే సీఎంగా సంతకం పెట్టిన మొదటి రోజే అన్న క్యాంటీన్ పెట్టుండేవారు. టీడీపీ ఇచ్చిన దానికంటే ఎక్కువగా పెళ్లి కానుక ఇస్తున్నాం. 200 యూనివర్శిటీల్లో విద్యాకానుకను అమలుచేస్తున్నాం. చంద్రబాబుకు సిగ్గుందా ఏనాడైనా అమ్మఒడి గురించి ఆలోచన చేశారా ప్రజలను అభిమానిస్తారు కాబట్టే జగన్ అమ్మఒడి తీసుకొచ్చారు. టీడీపీ నేతలందరినీ మెంటల్ ఆసుపత్రిలో చేర్పించాలని జనం ఎదురు చూస్తున్నారు. డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ రుణాలను ఎగ్గొట్టిన వాడు చంద్రబాబు. అక్కచెల్లెమ్మలు బాగుండాలనే జగన్ ఆసరా పథకం పెట్టారు. టీడీపీ నేతలు కళ్లుండి చూడలేని వాళ్లు, ఏనాడైనా మంచి పథకం పెట్టాలన్న ఆలోచనైనా చంద్రబాబు చేశారా అని రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద చంద్రబాబు మీద, లోకేష్ మీద ఆమె తీవ్ర ఆరోపణలు, వ్యాఖ్యలు చేశారు.