ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. బయటకు తెలిసే దాని కన్నా లోపల చాలానే ఉంది. కేంద్ర బీజేపీ పెద్దలు తమ మనసు మార్చుకున్నారు,తమకు అధికారం కావాలి. ఈసారి ఎన్నికల్లో కావాల్సిన సీట్లు కొరత ఉత్తరాధిలో పడతాయని స్పష్టంగా తెలుస్తున్న నేపధ్యంలో దక్షిణ భారతం వైపు వారు ఫోకస్ పెట్టారు. ప్రత్యేకించి ఉభయ తెలుగు రాష్ట్రాలు బీజేపీ పెద్దలకు సరికొత్త ఆశలను పెంచుతున్నాయి.
రెండుసార్లు అధికారం చేజిక్కించుకున్న టీయారెస్ కి ఈసారి అక్కడ చాన్స్ లేదని బీజేపీ లెక్క. అందుకే అక్కడ అన్ని అవకాశాలు వాడేసుకుని తామే కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయలనుకుంటోంది.ఏపీ విషయం చూస్తే జగన్ విషయంలో ఎందుకో కేంద్ర పెద్దలకు మోజు తీరింది అనే అంటున్నారు. జగన్ తో ఎన్నికల పొత్తులకు కుదరదు ఇక ఆయన రెగ్యులర్ పొలిటీషియన్ కాదు ఆయన ఏదనుకుంటే అది చేయాలనుకుంటారు.మూడు రాజధానుల నిర్ణయం నుండి ఏపీ అప్పుల వరకు చాలా వరకూ దూకుడు చేసిన పనులతో కేంద్ర పెద్దలకు జగన్ కి మధ్య చాలా గ్యాప్ వచ్చేసింది అంటున్నారు.
మొన్న అమిత్ షా టూర్ లో మీడియా మొఘల్ రామోజీ రావును కలవడం, ఎన్టీఆర్ ను కలవడం రెండు కూడా టీడీపీ కి కలిసివచ్చే అంశాలే. కెసిఆర్ ని నిలవరించాలి, ఆంధ్రాలో పార్టీ నిలదొక్కు కావాలి అంతే ఒక బలమైన సామాజిక వర్గం అవసరం ఉంది.అందుకే చంద్రబాబును తిరిగి తమ వైపు తిప్పుకోవాలనే చూస్తున్నారు బీజేపీ పెద్దలు.కుప్పంలో బాబు టూర్ లో భద్రతాపరమైన లోటు పాట్లు ఉన్నాయని తెలియడంతో ఆయనకు హుటాహుటిన కేంద్రం భద్రతన్ 12 +12గా పెంచేసింది. దీంతో బాబుకు ఢిల్లీ ఫుల్ సపోర్ట్ అనే సంకేతాలు పంపింది. ఇదంతా ఆగమేఘాల మీద చకచకా జరిగిన పరిణామం. బాబు భద్రత మీదడీజీఐ నేతృత్వంలోని ఎన్ఎస్జీ బృందం చంద్రబాబు ఇంటిని టీడీపీ ఆఫీసును పరిశీలించించింది.